Blood Clotting Symptoms In Telugu: శరీరంలోని రక్తం అవయవాల పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్తం బాగుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తున్నాయి. నిజానికి శరీరంలో రక్తం గడ్డ కట్టడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డ కట్టడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలామందిలో ఈ సమస్య కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అయితే శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి ప్రధాన కారణాలేంటో ఈ సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యూఎస్ ఎఫ్ డీఏ ప్రకారం ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గర్భనిరోధక మందులను వినియోగించే ప్రతి 10 లక్షల మందిలో 1200 నుంచి 1800 వరకు రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తున్నాయట. కొంతమందిలో ఇతర మందులను వాడటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని సమాచారం. మరి కొంతమందిలో మాత్రం థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, కరోనా వైరస్ కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది. చాలా అరుపుగా కొంతమందిలో గుండెలోని ధమనులు కూడా రక్తం గడ్డకట్టుకుపోతుంది. అయితే ఇలా రక్తం గడ్డ కట్టడం వల్ల చాలామంది చనిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆకస్మిక గుండెపోటు గుండె ఆగిపోవడం గుండె సమస్యలు రావడానికి ప్రధాన కారణం కోవిడ్ వైరసేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా శరీరంలోని రక్తంలో మార్పుల కారణంగా కొంతమందిలో గడ్డకట్టుకు పోతోంది. కాబట్టి కరోనా వైరస్ బారిన పడినవారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొంతమందిలో ఆధునిక జీవనశైలి పాటించడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయట.
ధూమపానం..
చాలామంది కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎక్కువగా మద్యపానం, ధూమపానానికి అలవాటవుతున్నారు. ఇలా అలవాటైన వారిలో ప్రతి పది లక్షల మందిలో 17 నుంచి 18 వేల మంది వరకు రక్తం గడ్డ కట్టి చనిపోతున్నారని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగి, మధుమేహం, అధిక బీపీ, కీళ్ల నొప్పుల వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ధూమపానానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రక్తం గడ్డ కట్టడం కారణంగా ఏర్పడే లక్షణాలు..
మాటల్లో ఇబ్బంది తలెత్తడం
చేతులు కాళ్లలో తరచుగా నొప్పులు రావడం
అప్పుడప్పుడు తలతిరగడం
ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పులు రావడం
ఛాతి భాగంలో విపరీతమైన నొప్పి రావడం
అధిక చెమట
శ్వాసకోశ ఇబ్బందులు
వెన్నునొప్పులు
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి