''మై డియర్ మచ్చా..'' అంటూ డబ్‌స్మాష్ వీడియోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న తమిళ పాటకు సంబంధించిన తెలుగు వెర్షన్ సాంగ్‌ను విడుదల చేశారు. బాలాజీ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న మారి 2 సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కంపోజిషన్‌లో స్వయంగా ధనుష్, ఎంఎం మానసి పాడిన ఈ పాట తమిళంలో సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యింది. మై డియర్ మచ్చా అనే లైన్‌కి చాలా మంది ఇప్పటికే తమ డబ్‌స్మాష్ వీడియోలను సైతం రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ పాటకు తెలుగులో ఎలాంటి స్పందన కనిపించనుందో తెలియాలంటే ఈ పాటపై ఓ లుక్కేయాల్సిందే.