లగడపాటి లెక్క తప్పింది ;  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి..

                   

Last Updated : Dec 11, 2018, 04:55 PM IST
లగడపాటి లెక్క తప్పింది ;  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి..

ఆంధ్రా ఆకోట్టర్ జోతిష్యం అట్టర్ ఫ్లాప్ అయింది. లగడపాటి రాజగోపాల్‌ సర్వే అంచనాలు తప్పాయి.  ప్రజాకూటమిదే అధికారమని పేర్కొన్నారు. తీరా ఫలితాలు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పిన జాతీయ మీడియా సర్వేలే నిజమయ్యారు. ప్రజాతీర్పులో ఎక్కడా గందరగోళం లేదు.. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీయే ప్రజలు అధికాన్ని అప్పగించారు. అయితే  ఒక్క మజ్లిస్‌ విషయంలోనే రాజగోపాల్‌ సర్వే నిజమైంది. మస్లిజ్ ఆరు స్థానాలకు పరిమితమౌతుందని లడడపాటి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి 6 స్థానాలో దక్కాయి.  భారీ ఎత్తున ఇండిపెండెంట్లు గెలుస్తారని పేర్లతో సహా లగడపాటి వెల్లడించారు. నారాయణ పేట్‌ నుంచి శివకుమార్‌ రెడ్డి, బోధ్‌ నుంచి అనిల్‌ జాదవ్‌, ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్‌, మక్తల్‌ నుంచి జలంధర్‌ రెడ్డి , రామగుండంలో కోరుగంటి చందర్‌ గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. తీరా ఫలితాలు వచ్చాక అవికూడ అబద్ధమని తేలింది. వీరిలో రామగుండం అభ్యర్థి కోరుగంటి చందర్‌ ఒక్కరే ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు.

Trending News