Watermelon Diet: వేసవి కాలంలో పుచ్చకాయలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి చాలామందికి తెలుసు. ఈ వేసవి తాపాన్ని తీర్చడానికి పుచ్చకాయ ఉపయోగపడుతుందని.. మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుందని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే పుచ్చకాయని ఇంకా ఎన్నో రకాలుగా వాడొచ్చు. ముఖ్యంగా పుచ్చకాయని సరైన పద్ధతిలో తీసుకుంటే.. చాలా త్వరగా బరువు కూడా తగ్గిపోవచ్చు అన్న విషయం మీలో ఎవరికన్నా తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం రండి..
ఈ వేసవి కాలంలో, వెయిట్ లాస్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సింది ఒకటే.. అదే పుచ్చకాయ డైట్.. దీనిని వాటర్ మిలన్ డైట్ అని కూడా అంటాము. వాటర్ మిలన్ డైట్ అనగానే.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా.. కేవలం వాటర్ మిలన్ తప్ప ఇంకేమీ తినకూడదు అని అనుకోవద్దు. సరైన పౌష్టికాహారం తింటూనే.. వాటర్ మిలన్ ను కూడా మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గగలం.
వాటర్ మిలన్ నైట్ ఎలా చేయాలి?
మొదటగా ఒక మూడు రోజులు.. పూర్తిగా పుచ్చకాయలను మాత్రమే తినాలి. మిగతా ఆహారం ఏమి తీసుకోకుండా.. మూడు పుట్లా పుచ్చకాయే తినాలి. దీనివల్ల మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. కొవ్వు కూడా నెమ్మదిగా కరగటం మొదలవుతుంది.
అలా అని మూడు రోజులకు మించి..ఎక్కువ కాలం ఇలా కేవలం మంచినీళ్లు, పుచ్చకాయ తోనే గడిపేయకూడదు. మూడు రోజుల తర్వాత.. ఒక పది రోజుల పాటు ఉదయం టిఫిన్ కి బదులు ఓట్స్, చీజ్, లాంటివి తీసుకోవచ్చు. ఓట్స్ నచ్చని వారు.. బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ టోస్ట్, బ్లాక్ కాఫీ కూడా చేర్చుకోవచ్చు. భోజనానికి కూరగాయలతో చేసిన సాలడ్ ఏమైనా తినొచ్చు. నచ్చిన వారు చికెన్ లేదా ఫిష్ తో కూడా సాలడ్ చేసుకొని తినొచ్చు. అయితే కూరగాయలు, చికెన్ లేదా చేపలు 100 గ్రాములు కంటే ఎక్కువ కాకూడదు. ఇక రాత్రి భోజనం బదులు.. కేవలం పుచ్చకాయ మాత్రమే తినాలి.
అయితే ఎక్కువ కాలం ఈ డైట్ చేయడం వల్ల.. బరువు పక్కన పెడితే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే పైన చెప్పిన పద్ధతిలో ముందు మూడు రోజుల కేవలం పుచ్చకాయ తిన్న తరువాత, ఒక వారం రోజుల పాటు తరువాత చెప్పిన డైట్ ని ఫాలో అవ్వండి. ఆ తరువాత ఆరోగ్యం బాగానే ఉంది అన్నప్పుడే.. మిగతా రోజులు కూడా కంటిన్యూ చేయండి.
గర్భిణీ స్త్రీలకు నో
మరో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వాటర్ మెలన్ డైట్ వల్ల చాలా త్వరగా బరువు తగ్గడం కనిపిస్తుంది.. కానీ ఈ డైట్ అందరూ చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ డైట్ కి దూరంగా ఉండాలి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ డైట్ ఫాలో అవ్వకూడదు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారు.. ఎక్కువ పుచ్చకాయలు తినకూడదు కాబట్టి.. ఈ డైట్ లో పుచ్చకాయల మోతాదు కూడా తగ్గించాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, పిల్లలు కూడా ఈ డైట్ కి దూరంగా ఉండటం మంచిది.
Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్ కట్.. ఉద్యోగి పోస్టు ఊస్ట్
Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Weight Loss: ఎండాకాలంలో పుచ్చకాయ డైట్..బరువు తగ్గడానికి దివ్య ఔషధం!