5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..

5 Cooling Face masks in Summer: భానుడి ప్రతాపం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

5 Cooling Face masks in Summer: భానుడి ప్రతాపం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మండే ఎండలకు ఈ 5 ఫేస్‌ మాస్కులు కూలింగ్‌ ఎఫెక్ట్‌ ఇస్తాయి. దీంతో మీ ముఖం మృదువుగా మారుతుంది.
 

1 /6

ముఖంపై మంట, దురదలు ఎండవేడిమికి మొదలవుతాయి. అంతేకాదు మీ ముఖానికి వెంటనే మెరుపు రావాలంటే కూలింగ్‌ మాస్కులను ట్రై చేయండి. ఈ మాస్కులను కలబంద, పుదీనాతో తయారు చేసుకోవాలి. ఎండ వేడిమికి ముఖం చికాకుగా మారుతుంది. ఈ కూలింగ్‌ మాస్కులు వేసుకుంటే ముఖం చల్లగా మారుతుంది.  

2 /6

కలబంద, యోగార్ట్‌ మాస్క్.. కలబంద నాలుగు స్పూన్స్, రెండు స్పూనస్‌ పెరుగులో వేసి బాగా కలపాలి. ఈ మస్క్‌ ముఖంపై వేసుకుని ఓ 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. 

3 /6

టమాట తేనె.. టమాట గుజ్జులో ఓ స్పూన్ తేనె వేసి రెండిటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మేడకు పట్టించాలి. దీన్ని చేతి వేళ్లతో లేకపోతే బ్రష్‌ సహాయంతో వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి.

4 /6

చందనం, రోజ్‌ వాటర్.. ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా రోజ్‌ వాటర్ వేసుకుని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరనివ్వాలి. ఓ 20 నిమిషాల తర్వాత నార్మల్‌ వాటర్‌తో ఫేస్ వాష్‌ చేసుకుంటే సరిపోతుంది.

5 /6

పెరుగు, కీర.. పెరుగు, కీరదోసకాయ గుజ్జుతో కూడా చల్లని ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసుకుని ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి.

6 /6

పసుపు, పుదీనా.. పుదీనాను మెత్తని పేస్ట్ తయారు చేసి అందులో పసుపు, రోజ్‌ వాటర్‌ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఓ 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్‌ చేసుకోవాలి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది చల్లదనాన్ని అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )