Peddapalli Loksabha: పెద్దపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేయగా.. తాజాగా మరో నేత కుమార్ కూడా నామినేషన్ వేశారు. అధిష్టానం ఆదేశాల మేరకే నామినేషన్ దాఖలు చేశానని ఎస్ కుమార్ చెప్పారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు బీజేపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరగ్గా.. ఆయన నామినేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ఎవరూ ఉంటారన్న దానిపై కేడర్‌లో గందరగోళం నెలకొంది.
Also Read: FD Interest Rates: ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై అదిరిపోయే వడ్డీ రేట్లు.. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ లాభాలు
పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయనకు పార్టీ బీఫామ్ ఇంకా ఇవ్వలేదు. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఎస్.కుమార్ తెరపైకి వచ్చారు. తాను అధిష్టానం ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని చెప్పారు. బీఫామ్ ఎవరికీ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎవరన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు గోమాసకే బీఫామ్ అంటూ మందకృష్ణ మాదిగ ఇప్పటికే ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు సందిగ్ధంలో ఉన్నారు.
మరోవైపు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన.. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో గడ్డం వివేక్ కొడుకు వంశీని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మనస్థాపానికి గురైన ఎంపీ వెంకటేశ్ నేత.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కిషన్ రెడ్డిని కలిసి.. తనకు టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని చెప్పారట. ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడి చెబుతానని కిషన్ రెడ్డి అన్నారు. వెంకటేశ్ నేతకే బీజేపీ టికెట్ అని ప్రచారం జరిగింది. మరి ఆయన నామినేషన్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ అధిష్టానం బీఫామ్ ఎవరికి ఇస్తుందనే విషయంపై కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది.
మరోవైపు పెద్దపల్లి జిల్లాలో ఒక్క నిమిషం లేటు నిబంధన ఓ ఎంపీ అభ్యర్ధి కొంపముంచింది. పెద్దపల్లి నుంచి దళిత బహుజన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాతంగి హనుమయ్య తన నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం లేటుగా వచ్చారు. దీంతో అతడిని గేటు దగ్గర నోడల్ అధికారి అడ్డుకున్నారు. లోపలికి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఆ సమయంలో ఎంతా బతిమిలాడినా సదరు అధికారి వినిపించుకోలేదు. దీంతో మాతంగి హనుమయ్య నోడల్ అధికారి కాళ్లు పట్టుకున్నారు. చివరకు తన నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు మాతంగి హనుమయ్య.
Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి