Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటలతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా తింటే రెట్టింపు లాభాలు..

Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటాలు చిన్నగా చూడటానికి అద్భుతంగా రంగురంగులో కనిపిస్తాయి ఇది స్నాక్స్ లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. చెర్రీ టమోటాలు రుచిగా ఉండటమే కాదు ఇందులో అద్భుతమైన పోషకాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 18, 2024, 07:22 PM IST
Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటలతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా తింటే రెట్టింపు లాభాలు..

Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటాలు చిన్నగా చూడటానికి అద్భుతంగా రంగురంగులో కనిపిస్తాయి ఇది స్నాక్స్ లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. చెర్రీ టమోటాలు రుచిగా ఉండటమే కాదు ఇందులో అద్భుతమైన పోషకాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్..
చెర్రీ టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో లైకోపీన్, బీటా కెరటిన్, విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది, అందుకే టమోటాలు ఎర్ర రంగులో ఉంటాయి, లైకోపీన్ ఫ్రీ రాడికల్ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది యాంటీ ఆక్సిడెంట్సు ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ నుంచి కూడా రిలీవ్ చేయడానికి ఉపయోగ పడతాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.

గుండె ఆరోగ్యం..
చెర్రీ టమాటాలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది సోడియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి. పొటాషియం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి సోడియంట్స్ తక్కువగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు .యాంటీ ఆక్సిడెంట్స్ చెర్రీ టమాటాల్లో ఉండటం వల్ల మన గుండె హెల్తీగా ఉంటుంది రక్తనాళాల పనితీరుకి మెరుగు చేస్తుంది.

ఇమ్యూనిటీ..
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది అనారోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడతాయి. చెర్రీ టమాటాలు మన డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థనే బలపడుతుంది జలుబు దగ్గు సమస్యలు నుంచి కూడా బయటపడొచ్చు.

ఇదీ చదవండి: మంచి బలం..నిత్యయవ్వనం పొద్దుతిరుగుడు విత్తనాలతోనే సాధ్యం..!

బరువు నిర్వహణ...
చెర్రీ టమాటాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కనిపిస్తుంది ఎక్కువగా దీంతో బరువు పెరగుతామనే బాధ కూడా ఉండదు. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు చెర్రీ టమోటాలు డైట్లో చేర్చుకోవచ్చు.

ఇదీ చదవండి: చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా? ఇలా చేయండి మైనంలా కరిగిపోతుంది..

చర్మ ఆరోగ్యం..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చేర్రీ టమాటాలు తినడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో వృద్ధాప్చాయాలు ఆలస్యం అవుతాయి ఇందులో ఉండే లైకోపీన్ సూర్యుడి హానికర అల్ట్రావైలట్ రేస్ నుంచి కాపాడుతుంది. దీంతో సన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారిస్తాయి. చెర్రీ టమాటాల్లో ఎన్నో పోషకాలకు పవర్ హౌస్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండెని ఆరోగ్యంగా చేస్తూ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బరువును కూడా పెరగకుండా కాపాడి స్కిన్ ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ చిన్న చిన్న చెర్రీ టమాటాలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు ఎన్నో పోషకాలు లభిస్తాయి అంతేకాదు ఈ చెర్రీ టమాటాలను సలాడ్స్ లో వేసుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News