ABP News-CVoter Opinion Poll on Loksabha Elections 2024: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. గెలుపు లెక్కలు వేసుకుంటూ తమకే ఓటు వేయాలని అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. ఇక ఎవరు విజయం సాధిస్తారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ న్యూస్-సీఓటర్ (ABP News-CVoter Opinion Poll) అభిప్రాయ సేకరణలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. సంపూర్ణ మెజారిటీతో మూడోసారి తిరిగి వస్తుందని అంచనా వేసింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించింది.
Also Read: Bhadrachalam: జానకిని పెళ్లాడిన రామయ్య.. భద్రాచలంలో కల్యాణ వైభోగం
మొత్తం 543లో 46.6 శాతం ఓట్ షేర్‌తో 373 సీట్లను గెలుచుకుంటుందని వెల్లడించింది. గతంలో కంటే మరింత భారీ మెజార్టీతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పింది. INDIA కూటమి 39.8 శాతం ఓట్ షేర్‌తో 155 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఈ పార్టీలు ఒంటరిగా పోటీ చేయగా.. మొత్తం 36.6 శాతం ఓట్లు సాధించాయి. ఎన్డీఎ ఓటు షేర్ 45.1 శాతం నుంచి 46.6 శాతానికి పెరగనుంది.
ఆంధ్రప్రదేశ్ NDA (TDP+BJP+JSP) కూటమి హవా ఉంటుందని అంచనా వేసింది. ఎన్డీఏ 46.7 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుచుకుంటుదని.. అధికార వైసీపీ 39.9 శాతం ఓట్లతో ఐదు సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. తెలంగాణ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 10 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. NDAకి 5, BRS, AIMIM పార్టీలు ఒక్కో స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 స్థానాల్లో డీఎంకే 30 సీట్లు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది. మిగిలిన 9 స్థానాలను INDIA కూటమి గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో 20 సీట్లను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లో 42 సీట్లు ఉండగా.. టీఎంసీ, బీజేపీ చెరో 20 సీట్లు గెలుచుకుంటాయని.. కాంగ్రెస్ 2 సీట్లలో విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్-సీఓటర్ తెలిపింది. అస్సాంలో ఎన్డీఎ 14 సీట్లలో 12 గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒడిశాలో బీజేపీ 13, బీజేడీ 7, కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధిస్తాయని పేర్కొంది. రాజస్థాన్‌లో 25, గుజరాత్ 26, మధ్యప్రదేశ్‌లో 28, ఛత్తీస్‌గడ్‌లో 10, కర్ణాటకలో 23 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అంచనా వేసింది. పంజాబ్‌లో కాంగ్రెస్ 7, ఆప్ 4 గెలుస్తుందని అంచనా వేయగా.. ఎన్డీఏకు 2 సీట్లు వస్తాయని తెలిపింది. బీహార్‌లో ఎన్డీఏ 33 సీట్లతో స్వీప్ చేస్తుందని.. INDIA కూటమి 7 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని వెల్లడించింది. యూపీలో ఎన్డీఎకి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Also Read: Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష,
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook