April Rashi Phalalu 2024: ఏప్రిల్ నెలలో గురు, శుక్ర గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. వీరిద్దరి కలయిక ఏన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల మూడు రాశులవారు ఎనలేని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
వృషభం
ఇదే రాశిలో శుక్రుడు మరియు బృహస్పతి కలవబోతున్నారు. వీరి సంయోగం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల జీతాలు పెరుగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ రాబడి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
మేషం
వృషభ రాశిలో గురు, శుక్రుల కలయిక వల్ల మేషరాశి వారు ఎనలేని కీర్తిప్రతిష్టలు గడిస్తారు. జాబ్ సాధించాలనే మీ కల ఫలిస్తుంది. మీరు సుఖవంతమైన జీవితం గడుపుతారు. మీరు ఈ సమయంలో ఎందులోనైనా పెట్టుబడులు పెడితే అవి మీకు మంచి రాబడులను ఇస్తాయి. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటుంది. కెరీర్ లో మీరు అనుకున్న స్థాయికి వెళతారు. వ్యాపారులు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను ఇస్తారు.
సింహం
సింహ రాశి వారికి గ్రహాల మైత్రి అనుకూల ఫలితాలను ఇస్తుంది. నలుగురిలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు లగ్జరీగా బతుకుతారు. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. భార్య భర్తల మధ్య మనస్పర్దలు తొలగిపోతాయి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మెుత్తానికి ఏప్రిల్ నెలంతా అద్భుతంగా ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?
Also Read: Happy Sri Rama Navami Wishes 2024: శ్రీ రామ నవమి శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్ మీ కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి