Road Accident In Patna: బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆటో మెట్రో క్రేన్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు మరణించారు. న్యూ బైపాస్ ప్రాంతంలోని రామ్‌లఖాన్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు. ప్రమాద స్థలంలోనే ఓ మహిళ, చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలన్నింటినీ పీఎంసీహెచ్‌కి తరలించారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించివారిని ఉపేంద్ర కుమార్, లచ్మన్ దాస్, అభినందన్ కుమార్, ఇంద్రజిత్ కుమార్, పింకీ దేవి, నేహా ప్రియదర్శి, రాణి కుమారిగా గుర్తించారు. మోతీహరి నివాసి ముఖేష్ కుమార్ సాహ్ని గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..
ట్రాఫిక్ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. మిఠాపూర్ నుంచి జీరోమైల్ వైపు 8 మంది ప్రయాణికులతో ఆటో వెళ్తోంది. మిఠాపూర్ సమీపంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో మెట్రో క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
మెట్రో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పాట్నా మెట్రో పనివేళల్లో క్రేన్ చుట్టూ గార్డు లేడని అంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత క్రేన్ డ్రైవర్ పారిపోయాడు. స్థానికులు పెద్ద ఎత్తున గూమిగుడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. క్రేన్ మెట్రో పనులు చేస్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook