భువనేశ్వర్: నేటి నుంచే 14వ హాకీ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమవబోతున్నాయి. మొదటిరోజైన బుధవారంనాడు తొలి మ్యాచ్‌లో బెల్జియం, కెనడా జట్లు పోటికి దిగనున్నాయి. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా జరగనునన్న ఈ పోటీల్లో మొత్తం 16 దేశాల జట్లు పాల్గొననుండగా వాటిని నాలుగు పూల్స్ కింద విభజించారు. ఒక్కో పూల్‌లో నాలుగేసి జట్లు ఉంటాయి. ప్రతీ పూల్‌లో తొలి ర్యాంక్‌లో నిలిచిన జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశం లభించనుండగా రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాలంటే, అంతకన్నా ముందుగా ప్లేఆఫ్స్‌లో తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది.
హాకీ వరల్డ్ కప్ 2018లో పాల్గొనే జట్లు, వాటి ర్యాంకింగ్స్ జాబితా:
దేశం - ర్యాంక్
1) ఇండియా -5
2) ఆస్ట్రేలియా-1
3) అర్జెంటినా -2
4) బెల్జియం - 3
5) నెదర్లాండ్స్ - 4
6) జెర్మనీ - 6
7) ఇంగ్లండ్ - 7
8) స్పెయిన్ - 8
9) న్యూజీలాండ్ -9
10) ఐర్లాండ్ -10
11) కెనడా -11
12) మలేషియా -12
13) పాకిస్తాన్ -13
14) దక్షిణ ఆఫ్రికా -15
15) చైనా - 17
16) ఫ్రాన్స్ -20
హాకీ వరల్డ్ కప్ 2018 పోటీల్లో పాల్గొనే జట్లు, వాటి ర్యాంకింగ్స్ జాబితా.. ప్రివ్యూ!