Nitish Kumar: కొన్ని నెలల కిందట అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్లీ ఎన్డీయేలోకి చేరిన జేడీ (యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గందరగోళానికి గురయ్యారు. ఎన్నికల ప్రచార సభలో తడబడి నవ్వులపాలయ్యారు. వాస్తవానికి విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ ట్రోలర్స్‌కు చిక్కారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి కాళ్లు మొక్కడం వివాదాస్పదమైంది. ఇది రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
నవాడా జిల్లాలో ఆదివారం బీజేపీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్ మాట్లాడారు. ఈ సమయంలో 25 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. దాదాపు అర్ధగంట పాటు మాట్లాడిన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. కంగారులో తడబడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4 వేల ఎంపీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. 400కు బదులుగా 4 వేలు అని పలికారు.
Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్ కల్యాణ్
నితీశ్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. 'నితీశ్ అద్భుతంగా మాట్లాడారు. నితీశ్‌జీ మంచి ప్రసంగం చేశారు. ఇంకా నేను మాట్లాడడానికి ఏమీ మిగలలేదు' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై విమర్శలు చేశారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నల వర్షం సంధించారు. ఇదే క్రమంలో ఇండియా కూటమిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మళ్లీ గెలిచిదే మా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 400 సీట్లు గెలుస్తామని పునరుద్ఘాటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook