VIVO Foldable Phones: గత కొద్దికాలంగా మార్కెట్‌లో ఫోల్టబుల్ స్మార్ట్ ఫోన్లకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వివో కూడా ఫోల్డబుల్ ఫోన్లను ప్రవేశపెడుతోంది. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్ కావడంతో చాలా అంచనాలున్నాయి.
VIVO X Fold 3 పేరుతో ఇండియాలో త్వరలోనే ఫోల్టబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోల్టబుల్ ఫోన్లలో అత్యంత సన్నమైనవిగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 3, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పేర్లతో మార్కెట్‌లో రానున్నాయి. ఈ ఫోన్లు 8.6, 8.8 ఎంఎం మాత్రమే మందం కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ఒకే రకమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటాయి. స్క్రీన్ 2480-2200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.53 ఇంచెస్ ఔటర్ డిస్‌ప్లే కలిగి ఉంటాయి. ఇక ఇన్నర్ డిస్‌ప్లే 8.03 ఇంచెస్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ కావడంతో చాలా ఫోన్ పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో ఇంటిగ్రేటెడ్ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సైడ్ మౌంటెడ్ స్కానర్ ఉంటాయి.
ఇక కెమేరా విషయంలో వివోకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. చాలామంది కెమేరా కోసమే వివో కొనుగోలు చేస్తుంటారు. వివో రెండు ఫోల్డబుల్ ఫోన్లలోనూ త్రిబుల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమ్ కెమేరా, మరో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమేరా ఉన్నాయి. పోర్ట్రెయిట్ ఫోటోల కోసం 64 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇవి కాకుండా సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఇచ్చారు.
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. రెండింట్లోనూ 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉండటం విశేషం. వివో ఎక్స్ ఫోల్డ్ 3 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక వివో ఎక్స్ ఫోల్ట్ 3 ప్రో 5700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవచ్చు. ఈ రెండు ఫోన్లు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉన్నాయి.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చ్‌లో భారీగా అందనున్న జీతం, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook