Rid Sore Throat Quickly: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో గొంతు సమస్యలు రావడం సర్వసాధారణమైంది. ఈ సమస్య థైరాయిడ్ కారణంగా వస్తే మరి కొంతమందిలో మాత్రం అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గొంతు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సమస్య మరింత తీవ్రతరమయ్యే ఛాన్స్ కూడా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమందిలో ఆహారాలను మింగడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ కారణంగా జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి జీర్ణ క్రియ సమస్యలు రాకుండా ఉండడానికి గొంతు సమస్య నుంచి ఉపశమనం పొందడం చాలా ముఖ్యం. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని 15 నిమిషాల పాటు పుకిలించి ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీటిని మింగకుండా ఉండడం చాలా మంచిది.
గొంతు నొప్పితో బాధపడుతున్న వారు ప్రతి రోజు కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అన్నం తొక్క తో తయారు చేసిన నీరు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనితో తయారు చేసిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు గొంతు నొప్పితో బాధపడుతున్న వారు గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తేనె నీటిని తీసుకోవడం వల్ల దగ్గు నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కాల్చిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి గొంతు నొప్పిగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాల్సి ఉంటుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి గోరువెచ్చని పాలు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తీవ్ర గొంతు నొప్పితో బాధపడేవారు రోజు పాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి