RCB Vs PBKS IPL 2024: పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. కోహ్లీ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో సొంత మైదానంలో బెంగళూరు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. మోస్తరు లక్ష్యాన్ని సమష్టి కృషితో ఆర్సీబీ కొంత కష్టంగానే ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. కోహ్లీ అర్ధ శతకానికి తోడు దినేశ్ కార్తీక్ తనదైన ముగింపుతో ఆర్సీబీకి తొలి విజయం దక్కింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ విధించిన మోస్తరు లక్ష్యాన్ని సులువుగా సాధించింది. ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీ బ్యాట్‌తో రఫ్పాడించాడు. తన ఫేవరేట్ చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ (49 బంతుల్లో 77: 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్ ముగ్గురూ కూడా కేవలం మూడు చొప్పున పరుగులు చేసి మైదానాన్ని వీడారు. రజత్ పతిదార్ (18), అనూజ్ రావత్ (11) కొంత స్కోర్ చేశారు. కోహ్లీ బాధ్యతను దినేశ్ కార్తీక్ (28 నాటౌట్) భుజానకెత్తుకున్నాడు. తనదైన బ్యాటింగ్‌తో ఉత్కంఠ మ్యాచ్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. మోస్తర్ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్లు కాపాడడంలో ఫెయిలయ్యారు. కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్, హర్షల్ పటేల్ చెరొక వికెట్ తీశారు.
Also Read: Holi 2024: రంగుల్లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు.. వైరల్ అవుతున్న వీడియోలు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆది నుంచి భారీగా స్కోర్ సాధించడంలో విఫలమైంది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. కెప్టెన్ శిఖర్ ధవన్ 45 (le4 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులతో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. టాపార్డర్‌కు తోడు మిడిలార్డర్ కూడా పరుగులు రాబట్టింది. కానీ రావాల్సినంత స్కోర్ రాలేదు. జితేశ్ శర్మ (27), ప్రభ్సిమ్రాన్ సింగ్ (25), సామ్ కురాన్ (23) లియామ్ లివింగ్‌స్టోన్ (17), శశాంక్ సింగ్ (21) పరుగులు చేశారు. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లు దానికి బ్రేక్ వేశారు. పరుగులకు అడ్డుకట్ట వేస్తూనే వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్వెల్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, అల్జారి జోసెఫ్ ఒక్కో వికెట్ తీశారు.
కోహ్లీ పరుగుల వరద
ఫిట్నెస్ కోల్పోయి టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కించుకుంటాడా అనే ఆలోచనలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ చిరుతలా రెచ్చిపోయాడు. ఓపెనర్‌గా వచ్చి దాదాపు ఆఖరి వరకు మైదానంలో ఉన్నాడు. 49 బంతుల్లో 77 పరుగులు సాధించి ఆఖరిలో ఔటయ్యాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లు సాధించడమే కాదు ఒక్కో పరుగు కోసం పరితపించాడు. వికెట్ల మధ్య కోహ్లీ పరుగెత్తిన విధానం కళ్లు చెదిరేలా ఉంది. ఇక ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ మెరుపులు మెరిపించాడు. బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేస్తూనే క్యాచ్‌లు పడుతూ పంజాబ్ కింగ్స్‌ను కట్టడి చేయడంలో కోహ్లీ విజయం సాధించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి