Machu Vishnu: నేషనల్ అవార్డ్ తెచ్చిన ఫస్ట్ తెలుగు హీరో బన్నీ.. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్: మంచు విష్ణు

Navatihi Utsavam In Malaysia: తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు 'మా' ప్లాన్ చేస్తోంది. మలేషియాలో ఈ వేడుకలు నిర్వహించనుండగా.. ఇంకా తేదీ ఖరారు కాలేదు. తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా ఈ నవతిహి ఉత్సవం నిర్వహిస్తామని విష్ణు మంచు తెలిపారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 23, 2024, 06:54 PM IST
Machu Vishnu: నేషనల్ అవార్డ్ తెచ్చిన ఫస్ట్ తెలుగు హీరో బన్నీ.. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్: మంచు విష్ణు

Navatihi Utsavam In Malaysia: తెలుగు సినీ ఇండస్ట్రీ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవతిహి ఉత్సవం నిర్వహించనున్నారు. త్వరలో మలేషియాలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. శనివరాం హైదరాబాద్‌ పార్క్ హయత్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ మాట్లాడుతూ.. విష్ణు మంచు తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి.. సభ్యులకు చేయాల్సిన పనుల గురించి మాట్లాడేవారని అన్నారు. ఈ ఈవెంట్‌ను మలేషియాలో గ్రాండ్‌గా నిర్వహిస్తామన్నారు. 

Also Read: Motorola Edge 50 Pro: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో మోటోరోలా కొత్త ఫోన్, లాంచ్ తేదీ

అనంతరం విష్ణు మంచు మాట్లాడుతూ.. 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ఆరంభం నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తు చేసుకుంటూ ఈ ఈవెంట్‌ను సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించాలని అనుకున్నామని చెప్పారు. 'మా' తరుఫున అతి పెద్ద ఈవెంట్‌ను జూలైలో మలేషియాలో నిర్వహిస్తామన్నారు. సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడి తేదీ ఖరారు చేస్తామన్నారు. అందరూ ఈ ఈవెంట్‌కు హాజరయ్యేలా చేస్తామన్నారు. మన సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోందని.. తెలుగు నటీనటులుగా తామంతా గర్విస్తున్నామని అన్నారు. తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా ఈ నవతిహి ఉత్సవం నిర్వహిస్తామన్నారు.

అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్‌తోపాటు పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారని విష్ణు మంచు అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం అని.. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుందన్నారు. అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడని.. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ అని చెప్పారు. మహేష్-రాజమౌళి మూవీ ఆసియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుందన్నారు. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారని.. కీరవాణి ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారని అన్నారు. ఇలా ఎన్నో సాధిస్తున్నామని.. అందుకే ఇప్పుడు వేడుకలు జరుపుకునేందుకు సరైన సమయం అని భావిస్తున్నామన్నారు. 

'మా'లో దాదాపు 800 కి పైగా ఆర్టిస్టులు ఉన్నారని.. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు ఉన్నారని చెప్పారు విష్ణు మంచు. మిగిలిన వాళ్లకు సపోర్ట్‌గా నిలబడేందుకు ఫండ్ రైజింగ్ చేస్తున్నామని.. తాము చేస్తున్న మెడికల్ ఇన్సురెన్స్ చాలా మందికి అండగా నిలిచిందన్నారు. మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని ఛాంబర్‌ను కోరామని.. దిల్ రాజు, దాము సపోర్ట్ చేస్తామన్నారని తెలిపారు. ఈ ఈవెంట్‌కు వేరే ఇండస్ట్రీ నుంచి నటీనటులు రాబోతున్నారని చెప్పారు. 

Also Read:  V Hanumanth Rao: రేవంత్ రెడ్డి రెండు సైడ్ లు వినాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ.హనుమంత రావు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News