IPL 2024 Opening Ceremony: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్లు సంపాదించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభోత్సవం చూడాలని చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడుతున్న నేపథ్యంలో టికెట్లుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. టీమిండియా క్రికెటర్లుకు కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ కు టికెట్లు లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో అశ్విన్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనెజ్‌మెంట్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు. చెపాక్ వేదికగా జరగబోతున్న చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ టికెట్లకు పుల్ డిమాండ్ ఉంది. తన కూతుళ్లు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు చూడాలని ఆనుకుంటున్నారని.. దయచేసి సీఎస్కే వాళ్లకు సాయం చేయండి’ అంటూ అశ్విన్ తన ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అశ్విన్ విజ్ఞప్తిని యాజమాన్యం చెన్నై యాజమాన్యం అంగీకరిస్తుందా? లేదా? చూడాలి.
మార్చి 22న జరిగే ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ తో ఐపీఎల్ షురూ కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను మార్చి 18న ఉదయం 9:30 గంటలకు పేటీఎమ్ ఇన్‌సైడర్(Paytm Insider)లో అమ్మకానికి పెట్టగా.. అది కాసేపటికే క్రాష్ అయింది. 2010, 2011 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిల్ ను గెలిచిన సీఎస్కే జట్టులో అశ్విన్ సభ్యుడు. అతను 2008 నుంచి 2015 వరకు సీఎస్సే ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు కోసం 70 వికెట్లు తీశాడు. ప్రస్తుత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో ఆర్ఆర్.. లక్నో జట్టును ఎదుర్కోబోతుంది. రీసెంట్ గా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. 500 వికెట్ల క్లబ్ లో కూడా చేరాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అతడే నంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.
Unreal ticket demand for the #CSKvRCB #IPL2024 opener at Chepauk.
My kids want to the see opening ceremony and the game.@ChennaiIPL pls help🥳— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 18, 2024
Also Read: Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook