Royal Challengers Bangalore WPL 2024 Winner: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కప్ కొట్టింది. ఏంటి నమ్మట్లేదా..? ఈ సాలా కప్ నమ్‌దే.. ఈ సాలా కప్ నమ్‌దే.. అంటూ ప్రతీ ఐపీఎల్‌లోనూ బరిలోకి దిగడం.. చివరకు ఖాళీ చేతులతో ఇంటికి రావడం.. దీంతో తమ జట్టు ఒక్కసారైనా కప్ గెలుస్తాందా అని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో స్మృతి మంధాన సేన అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి డబ్ల్యూటీఎల్ ట్రోఫిని గెలుపొంది.. తొలి టైటిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆర్‌సీబీ.. ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఢిల్లీ.. మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బెంగుళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read: Snake Venom Rave Party: వామ్మో.. విషపూరిత పాముల విషంతో రేవ్ పార్టీ..
ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. మొదటి నుంచే ఆచితూచి ఆడింది. లక్ష్యం తక్కువగా ఉండడంతో ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ వికెట్లు కాపాడుకుంటూ రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేశారు. డివైన్ (27 బంతుల్లో 32)ను శిఖా పాండే ఔట్ చేయడంతో ఆర్‌సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద స్మృతి మంధాన (31) ఔట్ అయినా.. ఎల్లీస్ పెర్రీ (35 నాటౌట్), రిచా ఘోష్ (17 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. మరో మూడు బంతులు ఉండగానే ఆర్‌సీబీ విజయదుందుభి మోగించింది.
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (44), లానింగ్ (23) దూకుడుగా ఆడడంతో 7 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 64 రన్స్‌కు చేరింది. భారీ స్కోరు దిశగా సాగుతున్న ఢిల్లీకి సోఫీ మోలినక్స్ బ్రేక్ వేసింది. ఒకే ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ తరువాత శ్రేయాంక పాటిల్ ఆర్‌సీబీ బ్యాట్స్‌వుమెన్ భరతం పట్టింది. నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ స్కోరు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు తీశారు.
Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
RCB Vs DC Highlights: జయహో ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ విన్నర్‌గా స్మృతి మంధాన సేన.. ఫైనల్లో ఢిల్లీ డీలా