నేడు స్త్రీలపై వేధింపులు, అఘాయిత్యాలు జరిగితే వారి కోసం నిర్భయ చట్టాలు లాంటివి ఉన్నాయని.. ఈ క్రమంలో వేధింపులకు పాల్పడే మగాళ్లపై కేసులు కూడా నమోదు చేసి జైల్లో పెడుతున్నారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే మగాళ్లపై వేధింపులు జరుగుతుంటే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని అదే వ్యక్తి ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో మగాళ్లపై కూడా కొందరు ఆడవాళ్లు వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్లో ఇదే కారణంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించారు.
ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెట్టుకొనే వారిని టార్గెట్ చేసి పలువురు మహిళలు వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. #మీటూ లాంటి క్యాంపెయిన్లు ప్రారంభించిన మహిళలు... తమను లైంగికంగా వేధించిన వారి వివరాలను బహిర్గతం చేస్తున్నారు. అయితే మగాళ్లకు ఆ అవకాశం లేదని./ వారు వేధింపులకు పాల్పడే మహిళల వివరాలను బహిర్గతం చేయలేరని కొందరు తెలపడం గమనార్హం.
ఇదే క్రమంలో ఓ వ్యక్తి ట్విటర్లో తెలంగాణ డీజీపీకి ఓ ప్రశ్న సంధించారు. ఆడాళ్లు ఒకవేళ మగాళ్ళను వేధిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. దానికి డీజీపీ కూడా సమాధానమిచ్చారు. ఎవరైనా పోలీసులకు ఒకటేనని.. మగాళ్లు కూడా వేధింపులు ఎదుర్కొంటే తమ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని.. లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Even men are harassed
Where should they go? #HeToo— Roop Darak (@roopnayandarak) November 1, 2018
Good afternoon sir, even men also complaint on above numbers or at any near by police station-Thank you.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 1, 2018