దేశంలో క్రీడాకారులకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహకాలు అందడం లేదని, ఫలితంగా తన లాంటి ప్రతిభ ఉన్న క్రీడాకారులు, అథ్లెట్స్ ఎంతో మంది నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు అంతర్జాతీయ స్థాయి బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత దినేష్ కుమార్. దినేష్ కుమార్ అలాంటిలాంటి బాక్సర్ కాదు... ప్రత్యర్థులపై పిడిగుద్దులు గుప్పించి 17 స్వర్ణ పతకాలు, 1 వెండి పతకం, 5 కాంస్య పతకాలు గెల్చుకున్న గొప్ప బాక్సర్. కానీ ఇప్పుడు ప్రభుత్వమే తనని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. హర్యానాలోని భివనికి చెందిన దినేష్ కుమార్ తండ్రి ఓ ఐస్ క్రీమ్ సెల్లర్. తాను ఐస్ క్రీమ్స్ అమ్ముకునైనా సరే తాను పడిన కష్టం తన కొడుకు పడకుండా ఓ గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడ్డాడు ఆ తండ్రి. కొడుకుని అంత గొప్పోడిని చేసిన ఆ తండ్రి.. కొడుకు అంతర్జాతీయ పర్యటనల కోసం కొన్ని అప్పులు కూడా చేశాడు.
Haryana: Dinesh Kumar, an international boxer and an Arjuna Awardee who hails from Bhiwani, now sells ice-creams for a living as well as to repay loan. He has won a total of 17 gold, 1 silver and 5 bronze medals and is now seeking government's help. pic.twitter.com/4U3SSKB3hC
— ANI (@ANI) October 28, 2018
అయితే, దేశం కోసం బాక్సింగ్ చేసిన దినేష్ కుమార్ ఇప్పుడు తండ్రి తన కోసం చేసిన అప్పులని తీర్చడం కోసం అవే ఐస్ క్రీమ్స్ ని అమ్ముకోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన దినేష్ కుమార్.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా తనకు ఎటువంటి సహాయం చేయలేదని, ఇకనైనా ప్రభుత్వం తనకు ఓ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.