/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

TS School Holidays:  తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి అంటే మార్చి 8, 9, 10 తేదీల్లో స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాయి. స్కూళ్లతోపాటు దాదాపు కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తించవచ్చు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో వారితోపాటు సాధారణంగా స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. రేపు మార్చి 8 న మహాశివరాత్రి రానుంది ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. అయితే, పండుగరోజు స్కూళ్లు, ఉద్యోగులకు మాత్రం సెలవు ఉండగా, మరుసటి రోజు అంటే మార్చి 9 న రెండో శనివారం ఉంది. కొన్ని స్కూళ్లకు రెండో శనివారం హాలిడే ఉండకపోవచ్చు. దాంతోపాటు ఆదివారం మార్చి 10 రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఈ సెలవులపై నోటిఫికేషన్ కూడా అప్రూవ్ చేసింది.

మహాశివరాత్రి 2024..
మహాశివరాత్రి హిందూవులకు అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఫిబ్రవరీ-మార్చి మధ్యలో ప్రతి ఏడాది వస్తుంది. చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. శివయ్యకు ఈరోజు భక్తులు ఉపవాసం, జాగరణలు చేస్తారు. శివపూజ చేసి దేవాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకుంటారు. శివలింగానికి అభిషేకం చేయడంతోపాటు ఇష్టమైన పూలు, పాలు సమర్పిస్తారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు. ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు.  ఇదే నెలలో మరో రెండు రోజులు కూడా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అంటే మార్చి 25న హోలీ వేడుక జరుపుకోనున్నారు. మార్చి 29న గుడ్ ఫ్రైడే రానుంది.  దీనికి సంబంధించిన సర్క్యూలర్ సంబంధిత స్కూల్ అధికారులు విడుదల చేస్తారు.

ఇదీ చదవండి: తెలంగాణపై సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ, దౌర్భాగ్యం: కేటీఆర్‌

గతనెల ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరి 8వ తేదీనా షబ్ ఏ మేరజ్ ఉండటంతో అధికారికంగా సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పండుగను ముస్లీం సోదరులు జరుపుకుంటారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ అతిపెద్ద కుంభమేళ అయిన సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంలో కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా సెలవులు ప్రకటించింది.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు మరో తీపికబురు.. గ్రూప్ 1,2,3 ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..

ఈ సెలవులపై అధికారిక ప్రకటన సంబంధిత స్కూళ్లు త్వరలోనే విడుదల చేయనున్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
telangana school holidays declared from tomorrow onwards on occation of mahashivaratri rn
News Source: 
Home Title: 

TS School Holidays: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు..
 

TS School Holidays: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు..
Caption: 
TS School Holidays
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
TS School Holidays: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Thursday, March 7, 2024 - 07:48
Created By: 
Renuka Godugu
Updated By: 
Krindinti Ashok
Published By: 
Renuka Godugu
Request Count: 
22
Is Breaking News: 
No
Word Count: 
313