Realme 12 5G series: ఇండియాలో లాంచ్ కాబోతున్న రియల్​మీ 12 సిరీస్ ఫోన్స్, పుల్ డిటెయిల్స్ ఇవే..

Realme 12 5G series Features and Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్​మీ తన సరికొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ని ఇవాళ లాంచ్ చేయనుంది. 12, 12 ఫ్లస్ సిరీస్ ఫోన్స్ ను ఇండియాలో విడుదల చేసేందుకు రియల్ మీ రెడీ అయింది. ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2024, 11:55 AM IST
Realme 12 5G series: ఇండియాలో లాంచ్ కాబోతున్న రియల్​మీ 12 సిరీస్ ఫోన్స్, పుల్ డిటెయిల్స్ ఇవే..

Realme 12 5G series India launch today: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్​మీ తన 12 5జీ సిరీస్ ఫోన్స్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. దీని లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని రియల్ మీ ఇండియా యెుక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించవచ్చు. ఈ 12 సిరీస్ ఫోన్స్ ను ముందుగా బుక్ చేసుకున్న వారు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఇది మిడ్ రేంజ్ ఫోన్. రూ.20 వేల రూపాయల్లో ఫోన్ కొనే వారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి. 

ధర ఇదే..
లీకైన సమాచారం ప్రకారం, రియల్ మీ 12 5జీ 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉండే అవకాశం ఉంది. ఇది మనదేశంలో వుడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో రాబోతుంది. అంతేకాకుండా, 8జీబీ ర్యామ్/256జీబీ 12+ 5G మోడల్ ధర రూ. 22,999గా ఉండొచ్చని సమాచారం. ఇది స్మార్ట్‌ఫోన్ పయనీర్ గ్రీన్ మరియు నావిగేటర్ బీజ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

ఫీచర్స్ ఇవే..
రియల్ మీ 12+ 5G  స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతుంది. ఇది 6.67-అంగుళాల పుల్ హెచ్డీ ప్లస్ ఎమోలోడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50మెగా ఫిక్సల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సార్ తో రాబోతుంది. అంతేకాకుండా ఇందులో అప్టికల్ ఇమేజ్ స్టెబిలేజైషన్ కూడా ఉంది. ఇందులో 8మెగా ఫిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2మెగా పిక్సల్ మాక్రో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 16మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాను కూడాకలిగి ఉంది. ఈ ఫోన్ 67వాట్స్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మెుబైల్ 5,000mAh బ్యాటరీతో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడవనుంది. రియల్ మీ 12 5జీ మీడియా టైక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ తో రాబోతుంది. అంతేకాకుండా ఇది 45వాట్స్ సూపర్ వుక్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ 108MP 3x పోర్ట్రెయిట్ జూమ్ కెమెరాను కలిగి ఉంటుంది.

Also Read: PPF Benefits: పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్, నెలకు 5 వేలతో 26 లక్షలు పొందే అవకాశం

Also Read: Pradhan Mantri Ujjwala Yojana 2.0: అదిరిపోయే స్కీమ్.. ఫ్రీగా రెండు గ్యాస్ సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News