అసెంబ్లీ ఎన్నికలు 2018: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికలు 2018: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Oct 21, 2018, 10:06 AM IST
అసెంబ్లీ ఎన్నికలు 2018: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, పార్టీ జాతీయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, బీజేపీ ప్రచారాలు, పర్యటనలు తదితర అంశాలపై చర్చించారు.

బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

అనంతరం బీజేపీ పార్టీ తెలంగాణ సహా మరో రెండు రాష్ట్రాలు- ఛత్తీస్‌గఢ్, మిజోరాంలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో 38 మందితో తొలి జాబితా విడుదల చేసింది. జేపీ నడ్డా ఈ జాబితాను విడుదల చేశారు. అలాగే 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 77 మందితో,  40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో 13 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.

తెలంగాణకు ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో ముగ్గురు మహిళలు ఉన్నారు. నలుగురు 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఉన్నారు. ముగ్గురు ఎస్సీ, ఆరుగురు ఎస్టీ, తొమ్మిది మంది ఓబీసి వర్గానికి చెందిన వారు ఉండగా.. 9 మంది వ్యవసాయ నేపథ్యం ఉన్నవారు, ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు లాయర్లు, 12 మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

ముషీరాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, అంబర్ పేట నుంచి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, పెద్దపల్లె నుంచి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి, ఆంధోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తదితరులు పోటీ చేయనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7, 2018న జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 11, 2018న ప్రకటిస్తారు.  

 

Trending News