Minor Boy Marriage Proposol Goes Viral In Pakistan: సాధారణంగా యుక్త వయసు వచ్చాక తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ వారి కోసం.. సరైన అబ్బాయిని, అమ్మాయిని జోడిగా వెతికి మరీ పెళ్లిచేస్తుంటారు. దీని కోసం కొందరు మ్యాట్రీమోనీలకు వెళ్తుంటారు. మరికొందరు తెలిసిన వాళ్లకు చెబుతుంటారు. ఇలా పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే.. కొన్ని చోట్ల బాల్యవివాహాలు కూడా చేస్తుంటారు. ఇది చట్టం ప్రకారం తప్పు. కానీ కొందరు బైటపడకుండా కూడా చూస్తుంటారు.
మరికొన్ని చోట్ల అబ్బాయి, అమ్మాయికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచే ప్లాన్ లు చేసుకుంటారు. పెద్దాయ్యాక.. ఇద్దరికి పెళ్లిళ్లు చేస్తుంటారు. అనేక దేశాలలో పెళ్లిళ్లకు నిర్ణీతమైన వయసు ఉండేలా చూస్తుంటారు. చాలా చోట్ల అబ్బాయిలకు 18, ఆడవారికి 16 సంవత్సారాలుగా పెళ్లి వయసు ఉంటుంది.
పాకిస్థాన్ లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 13 ఏళ్ల బాలుడు తనకు పెళ్లి చేయాలని తన తల్లిదండ్రుల దగ్గర మారాం చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్లిచేయకుంటే, స్కూల్ కు సైతం వెళ్లేది లేదని తెల్చి చెప్పాడు. దీంతో తమ బాలుడికి ఎన్నోరకాలుగా చెప్పిచూశారు. వినకపోయేసరికి తమ బాలుడి కోసం, మరో బాలికకు ఇచ్చి పెళ్లి చేశారు. పాక్ చట్టాల ప్రకారం.. అబ్బాయిలకు పెళ్లి వయసు..18 సంవత్సరాలు, అమ్మాయికి 16 సంవత్సరాలుగా నిర్ణయించారు.
సింధ్ ప్రావిన్స్ 2013లో రెండు లింగాల వారి వివాహ కనీస వయస్సును 18కి పెంచడానికి చట్టాన్ని ఆమోదించినప్పటికీ, ఈ మార్పు దేశవ్యాప్తంగా అమలు కాలేదు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర రచ్చగా మారింది. చదువుకొనంటే తల్లిదండులు ఇలా పెళ్లి చేయడమేందని నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు.
Read More: Samantha Stills: అడవిలో అందాల సెగలు రేపుతున్న సమంత.. సరస్సులో హాట్ ఫొటోలు
ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరి ఎంగెజ్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలిక ఇంట్లో వాళ్లు కూడా ఈ పెళ్లికి అంగీకరించడం పట్ల నెట్టింట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాడి తండ్రికి బాగాలేదేమో.. అందుకే ఇలా పెళ్లి చేసుండొచ్చు కదా.. అని కొందరు కామెంట్ లు పెడుతున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook