Girl Injured By Elephant Attacks: చాలా మంది శునకాలు, పిల్లులను ఇంట్లో పెంచుకుంటారు. కానీ కొందరు ఏనుగులు, గుర్రాలను కూడా పెంచుకుంటారు. అయితే.. చాలా వరకు జంతువులు తమ యజమానితో విశ్వాసంగానే ఉంటాయి. కానీ కొత్త వారు వచ్చినప్పుడు మాత్రం దగ్గరకు రానివ్వవు. మన ఇళ్లలో కూడా అలానే.. కుక్కలు ఎవరైన కొత్త వారు వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ, ఇంట్లో వారిని అలర్ట్ చేస్తుంటారు.
Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk
— non aesthetic things (@PicturesFoIder) February 21, 2024
జంతువులకు ఎప్పుడు కూడా దూరం నుంచే చూడాలని పెద్దలు చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం అత్యుత్సాహం చూపిస్తుంటారు. వాటితో సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు బాగానే ఉన్నా.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. జంతువుల బారిన పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.
తాజాగా, మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. జంతువులు వారి యజమానులతోనే కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తుంటాయి. అందుకే కొత్తగా.. ఇతరుల దగ్గరుండే ఏ పెంపుడు జంతువు జోలికి అస్సలు పోకూడదు. కానీ ఇక్కడ యువతి.. ఏనుగు మేత మెస్తుండగా దాని దగ్గరకు వెళ్లింది. పాపం.. ఏనుగు రెండు చెవులను ఊపుకుంటూ.. తినేటప్పుడు డిస్టర్బ్ చేయకుడదన్నట్లు తలను అటూ ఇటూ ఊపుతుంది. కానీ ఒక యువతి మాత్రం.. కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. ఏనుగు దగ్గరకు వెళ్లింది.
అంతటితో ఆగకుండా.. ఫోటోలకు ఫోజులిస్తూ మరింత దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంతలో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు ఒక్కసారిగా యువతిని తన తుండంతో ఎత్తి దూరంగా విసిరేసింది. భయపడిపోయిన యువతి.. వామ్మో.. అంటూ తన బ్యాక్ ను పట్టుకుని.. కుయ్యో.. మొర్రో అంటూ దూరంగా పారిపోయింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు.
Read More: Ariyana Glory: నేచర్ లో అందాల అరబోస్తూ రచ్చ చేస్తున్న అరియానా, ఫిక్స్ వైరల్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వీడియో ను చూసిన నెటిజన్లు.. మరీ ఈ ఎక్స్ ట్రాలే వద్దనేదని, క్రూర జంతువుల జోలికి ఎందుకు వెళ్లావమ్మా.., ఇప్పుడు సమ్మగా ఉందా.. అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook