హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మ్యాచ్ పై పట్టు సాధించే దిశగా కోహ్లీసేన కదులుతోంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ టీమిండియా యువ బాట్స్ మెన్లు అదరగొడుతున్నారు. తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కిన యువ ఓపెనర్ పృథ్వీ షా 70 పరుగులతో మళ్లీ రాణించడగా రిషబ్ పంత్ (85 నాటౌట్) విండీస్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. పంత్ కు అజింక్య రహానే ( 75 నాటౌట్) చక్కటి సహాకారం అందించాడు. భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్లు రెండో రోజు ఆటముసిగే సమయానికి నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. విండీస్ కంటే మూడు పరుగులు మాత్రమే వెనుకంజలో ఉన్న టీమిండియాలో చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నాయి. రేపు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించి విండీస్ ను ఒత్తిడిలోని నెట్టాలని కోహ్లీసేన భావిస్తుంది
అంతకుముందు 295/7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలో విండీస్ 311 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేవలం 16 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. పేసర్ ఉమేశ్ యాదవ్ ఆరు కీలక వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. యువ స్పిన్ మాంత్రికుడు కుల్ దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఉమేష్ కు తోడుగా నిలిచాడు.