Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మైదానంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు పిడుగుపాటుకు బలి 

Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 13, 2024, 03:04 PM IST
Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మైదానంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు పిడుగుపాటుకు బలి 

Shocking Video: మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఓ ఆటగాడు మృతి చెందాడు. క్రీడా రంగాన్ని విస్మయానికి గురి చేసిన ఈ సంఘటన ఇండోనేసియా దేశంలో చోటుచేసుకుంది. పిడుగుపాటుతో మైదానంలో ఉన్న ఆటగాడు ఎలా మృతిచెందాడో వీడియోలో రికార్డయ్యింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అని నోరెళ్లబడుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: World Cup: చిన్న కప్పును కూడా తన్నుకుపోయిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో భారత్‌కు నిరాశ

ఇండోనేసియా పశ్చిమ జవాలోని సిలివాంగి ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఓ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 10వ తేదీన శనివారం సాయంత్రం రెండు జట్ల మధ్య స్నేహాపూర్వక మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్‌ రహర్జా (35) కూడా పాల్గొన్నాడు. మ్యాచ్‌లో భాగంగా మైదానంలో బంతి కోసం పరుగెడుతున్న రహర్జా మీద అకస్మాత్తుగా పిడుగు పడింది. పెద్ద శబ్ధంతో నిప్పుల కొలిమి వచ్చి అతడి మీద పడడంతో రహర్జా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన తోటి క్రీడాకారులు వెంటనే రహర్జాను పరిశీలించారు. స్పృహ కోల్పోవడంతో వెంటనే నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రహర్జా మృతిచెందిన వైద్యులు నిర్ధారించారు. 

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

ఊహించని సంఘటనతో సెప్టైన్‌ రహర్జా మృతిచెందడంతో తోటి క్రీడాకారులంతా తీవ్ర విషాదంలో మునిగారు. మైదాన ప్రాంగణమంతా విషాద వాతావరణం అలుముకుంది. అయితే ఇండోనేషియాలో ఇలా పిడుగుపడడంతో రెండోసారి. గత సంవత్సరం తూర్పు జావాలోని ఓ ప్రాంతంలో ఓ టోర్నమెంట్‌ జరుగుతుండగా అక్కడ కూడా ఇదే మాదిరి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో 13 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు బలయ్యాడు. తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్‌లు నిర్వహించే ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకుని నిర్వహించాలని సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇకపై మ్యాచ్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. కాగా మృతిచెందిన రహర్జా కుటుంబానికి తోటి ఆటగాళ్లతోపాటు అక్కడి ఫుట్‌బాల్‌ నిర్వాహకులు అండగా నిలిచారని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News