Uttam Kumar Reddy Fires On EX CM KCR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది విషయంలో అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా జరిగాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ చేశారు. ఈ సందర్భంలో తెలంగాణ ఎలా దోపిడికి గురైందో వివరించారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
Read More: Krithi Shetty: పలుచటి చీరలో దాచినా దాగని కృతి శెట్టి అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
గతంలో కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల మధ్య జరిగిన చర్చల తర్వాత తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏపీ యాభైశాతం, తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను తరలించుకుపోతుందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల రోజున.. జగన్ ప్రభుత్వం పోలీసులను పంపిమరీ ఆక్యుపై చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ అడ్డుకోలేని ఉత్తమ్ గుర్తు చేశారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 60 శాతం ఉండాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం.. 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల విషయంలో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుందని ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ చేసతిన తప్పిదాలు అంటూ ఆయన నోట్ ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా గండికొట్టారని అన్నారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులను పొందేందుకు తెలంగాణకు హక్కు ఉందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదని ఉత్తమ్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook