Mahesh Babu GMB: టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్ది ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఫ్రాడ్ జరుగుతోంది అని తెలిసిన కొంతమంది తెలివి తక్కువగా వెళ్లి అందులో ఇరుక్కుంటున్నారు. ప్రతిరోజు సైబర్ క్రైమ్ ఆఫీసుల చుట్టూ ఎంతోమంది బాధితులు తిరుగుతూ కనిపిస్తున్నారు. ఆన్లైన్లో ఎప్పుడు ఎవరి డబ్బును.. ఏ మోసగాడు కాజేస్తాడో చెప్పలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఇలాంటి మోసాలకు చాలామంది సెలబ్రిటీల పేర్లు వాడడం మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితార పేరుని వాడి ఆన్లైన్ లో ఫ్రాడ్ చేస్తున్నారట.
సెలబ్రిటీల పేరుతో ఇన్వెస్ట్మెంట్ పథకాలను సృష్టించి ఆన్లైన్లో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు ఘరానా మోసగాళ్లు. బాగా పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలు కాబట్టి మోసపోయే ఛాన్స్ ఉండదు అని నమ్మి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు.. అడ్డంగా బుక్ అయిపోతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు.
ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక మోసగాడు పన్నిన సైబర్ వల గురించి ఘట్టమనేని ఫ్యామిలీ.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోని సైబర్ క్రైమ్ సెల్ కు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ డిస్కషన్ గా మారింది. మహేష్ బాబు కూతురుగా.. సితార కు ఉన్న పాపులారిటీని పెట్టుబడిగా వాడుకొని అతని ఈ మోసాలకు పాల్పడుతున్నాడు.ఈ నేపథ్య ఆన్లైన్లో సితార పేరుతో ఇన్వెస్ట్మెంట్ లింకులు పంపుతున్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఘట్టమనేని కుటుంబం మోసగాడు ఎవరో కనిపెట్టాలని కేసు నమోదు చేయడంతో పాటు ఇటువంటి ఆన్లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ప్రజలను ను అభ్యర్థించారు. పొరపాటున ఎవరైనా సితార ఘట్టమనేని పేరు ఉపయోగించి పెట్టుబడులు పెట్టవలసిందిగా మీకు లింకులు పంపితే.. అది కేవలం ఎవరో మోసగాడు పన్నిన వల అని అర్థం చేసుకోవాలని వారు కోరారు. మీరు చూస్తున్న సెలబ్రిటీ అకౌంట్స్ అధికారికమైనవేనా కాదా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించి.. నిర్ధారించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Attention! pic.twitter.com/6tX9yNQT5G
— GMB Entertainment (@GMBents) February 9, 2024
మొత్తానికి సితార క్రేజ్ ను మోసగాళ్లు ఈ రకంగా ఎన్కాష్ చేసుకుంటున్నారు అన్న విషయం ఈ వార్తతో వెలుగులోకి వచ్చింది. మరింత నష్టం జరగకముందే మహేష్ బాబు కుటుంబం అలర్ట్ అవ్వడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం పై సైబర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దీని వెనక ఉన్న మోసగాళ్లు ఎవరు అన్న విషయం త్వరలో తెలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter