Infinix Smart 8: 16జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5- ఎంపీ కెమేరా స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే

Infinix Smart 8: దేశంలో మరో కొత్త స్మార్ట్ ‌న్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్‌లో అత్యధిక ఫీచర్లతో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇది. దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ ఫోన్ ఇప్పుడు ధర కారణంగా  మరోసారి వార్తల్లోకెక్కనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2024, 08:07 AM IST
Infinix Smart 8: 16జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5- ఎంపీ కెమేరా స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే

Infinix Smart 8: ఇటీవల గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్లలో కెమేరాతో పాటు ర్యామ్ కూడా ఎక్కువ ఉండే విధంగా  చూసుకుంటున్నారు. అయితే ర్యామ్ పెరిగే కొద్దీ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అదికమైపోతుంటుంది. కానీ ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఇన్‌ఫినిక్స్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. 

దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇన్‌ఫినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లు , ఆకర్షణీయమైన డిజైన్ ఉండటమే కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరకు లభ్యమౌతున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 పేరుతో లాంచ్ అయిన ఫోన్ 128 జీబీ స్టోరేజ్ వరకూ అందుబాటులో ఉంటుంది. ఇక ర్యామ్ అయితే 4 జీబీ, 8 జీబీ ర్యామ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 

తక్కువ బడ్జెట్‌లో 8 జీబీ ర్యామ్ కావడంతో మార్కెట్‌లో ఇన్‌ఫినిక్స్ ఆకట్టుకోనుంది. గత నెలలోనే ఈ ఫోన్ మార్కెట్‌లో ప్రవేశించినా అప్పట్లో కేవలం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మాత్రమ ఉండేది. కానీ ఇప్పుడు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లాంచ్ అయింది. మరో వేరియంట్ 16 జీబీ ర్యామ్‌తో లాంచ్ అయింది. ఇందులో 8జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలకే లబించనుంది. ఇది లాంచ్ ఆఫర్. ఇక ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో 1000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. దీనికితోడు 699 రూపాయల విలువైన మ్యూజిక్ యాప్ స్పాటిఫై ప్రీమియం ఏడాది సభ్యత్వం లభిస్తుంది. ఇక ఇందులోనే 16 జీబీ వేరియంట్ ధర 9,999 రూపాయలు అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. అంటే కేవలం 10 వేలలోపు ధరలో ఇన్‌ఫినిక్స్ 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ లభించనుంది. 

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ఫీచర్లు

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, 90 హెర్చ్జ్ ఎల్‌సిడి స్క్రీన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్  హెలియో జి36 ఎస్ఓసి కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 

Also read: Post office special scheme: వృద్ధాప్యంలో 3 నెలలకోసారి 10 వేలు అందే అద్బుతమైన స్కీమ్ ఇదే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News