IND Vs SA Under 19 World Cup Highlights: అండర్-19 ప్రపంచకప్ 2024లో యువభారత్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్-1లో యంగ్ ఇండియా రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఓటమన్నదే లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
బెనోని వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సౌతాప్రికా. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 244 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన యువ భారత్ 48.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (124 బంతుల్లో 81, 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96, 11 ఫోర్లు, 1 సిక్స్) లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.
Also Read: India Vs Zimbabwe: జింబాబ్వేతో టీమిండియా టీ20 సిరీస్.. షెడ్యూల్ ఇదే..!
రాణించిన సచిన్, సహారన్..
సౌతాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా సఫారీ పేసర్లు అయిన క్వెన మఫక, ట్రిస్టన్ లుస్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన యువ భారత్ ను కెప్టెన్ ఉదయ్ సహరన్, మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్‌లు ఆదుకున్నారు. హాఫ్ సెంచరీల తర్వాత దూకుడు పెంచిన ఈ ఇద్దరూ భారత్‌ను విజయం దిశగా నడిపించారు. కానీ మఫక మరోసారి యంగ్ ఇండియాను దెబ్బకొట్టాడు. సచిన్ దాస్, అవినాశ్ వికెట్లు తీసి సపారీ జట్టును పోటీలోకి తెచ్చాడు. చివర్లో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) అద్భుతంగా ఆడి బారత్ ను గెలిపించాడు.
Also Read: Jasprit Bumrah: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. రాజ్‌కోట్ టెస్టుకు బుమ్రా దూరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook