Peddapalli MP Venkatesh Netha Joins In Congress: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో పావులు కదుపుతు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ములిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు.. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.
Read More: Niharika Konidela: క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిహారిక.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత.. ఎంపీ వెంకటేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ప్రస్తుతం తెలంగాణాలోని పొలిటికల్ హీట్ గురించిన చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఒకింత టెన్షన్ కల్గించే అంశంగా మారింది. ఇదిలా ఉండగా మూడు నెలల గ్యాప్ తర్వాత గులాబీ బాస్.. తెలంగాణ భవన్ కు ఈరోజు చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.
Read More: Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి
ఇదిలా ఉండగా మరో వైపు తెలంగాణాలో పొలిటికల్ హీట్ కాక పుట్టిస్తుంది. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి, బాల్క సుమన్ ల దిష్టి బొమ్మలను బీఆర్ఎస్, కార్యకార్తలు దహనం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ను దూషించడం సబబు కాదని, బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో మాజీ సీఎం పదేళ్లపాటు ప్రజలను దోచుకుని ఇప్పుడు అమాయంగా మాట్లాడుతున్నారని, ఈ నీటి సమస్య బీఆర్ఎస్ నేతల వల్ల వచ్చిందని రేవంత్ గత ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ ను బూతులు తిడుతూ ఏకీపారేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook