Inamates In Lucknow HIV Positive: ఉత్తర ప్రదేశ్ లో పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. లక్నో జైలులో శిక్ష ను అనుభవిస్తున్న ఖైదీలకు హెచ్ఐవీ సోకినట్లు బైటపడటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్ అని తేలింది. సెప్టెంబరు నుండి హెచ్‌ఐవి టెస్టింగ్ కిట్‌లు అందుబాటులో లేకపోవడమే ఆలస్యంగా డిసెంబరులో జరిగిన పరీక్షకు కారణమని జైలు అధికారులు పేర్కొన్నారు.
Read More: Ravi Teja - Eagle: రవితేజ 'ఈగిల్' మూవీ మేకింగ్ వీడియో విడుదల.. అదిరిపోయిన విజువల్స్..
పోలీసుల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో ఎక్కువ మంది మాదకద్రవ్యాల వ్యసనం కల్గిన వ్యక్తులని చెప్పారు. అంతే కాకుండా.. జైలు ప్రాంగణం వెలుపల కలుషితమైన సిరంజిలను ఉపయోగించడం ద్వారా ఈ ఖైదీలు వైరస్‌కు గురయ్యారని పోలీసులు తెలిపారు. జైలులోకి వచ్చినప్పుడు ఏ ఖైదీకి హెచ్‌ఐవీ సోకలేదని జైలు అధికారులు ప్రకటించారు.
ఘటనపై సీరియస్ అయిన పోలీసులు...
HIV-పాజిటివ్ ఖైదీలందరిని లక్నోకు తరలించారు. ఖైదీలంతా ప్రస్తుతం ఆసుపత్రిలో సాధారణ స్థితిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. పోలీసులు ఘటనపై అప్రమత్తంగా ఉందన్నారు. హెచ్ఐవీ సోకిన ఖైదీల ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో హెచ్‌ఐవి సంక్రమణ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని పోలీసు పరిపాలన హామీ వివరించింది.
Read More: Glowing Skin Tips: గ్లోయింగ్ స్కిన్‌కు ఖరీదైన క్రీమ్స్ అవసరంలేదు.. ఈ ట్రిక్ పాటించండి చాలు..
వ్యాధి సోకిన ఖైదీలందరూ జైలు లోపల ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ప్రస్తుతం.. వైరస్ వ్యాధి పూర్తి నియంత్రణ కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యం, భద్రతా పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం.. వైరస్ యొక్క మూలంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, జైలు లో ఉన్న ఖైదీలకు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రస్తుత పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో తీవ్ర సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook