Lagam: లగ్గంతో రానున్న రాజేంద్రప్రసాద్.. పెళ్లిపుస్తకం తరువాత ఆ స్థాయి చిత్రం అంటున్న నటుడు

Rajendra Prasad: ఒకప్పుడు కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. అప్పట్లో ఈయన హీరోగా చేసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.. ముఖ్యంగా పెళ్లి పుస్తకం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ లగ్గం సినిమా ఆ రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 06:51 PM IST
Lagam: లగ్గంతో రానున్న రాజేంద్రప్రసాద్.. పెళ్లిపుస్తకం తరువాత ఆ స్థాయి చిత్రం అంటున్న నటుడు

భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్న సినిమా లగ్గం. సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న  ఈ సినిమాకు లో సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 5నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ సందర్భంగా డా . రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ…”లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి. "లగ్గం విందు భోజనం" లాంటి సినిమా” అని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఈ చిత్రం దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ... "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం మాత్రమే కాదు!! రెండు మనసులు కలవడం. అంటూ  గట్టి దావత్ ఇవ్వబోతున్నాo” అని అన్నారు.

 "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్  ప్రతి ఒక్కరికి  వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుంది. పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అని తెలియజేశారు ఈ సినిమా హీరో సాయి రొనక్. 

ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా  బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read: Valentines Day Gifts: వాలెంటైన్స్ డే Gift ఇవ్వాలనుకుంటున్నారా?..ఫ్లిప్‌కార్ట్‌లో REDMI Note 13 Pro 5G మొబైల్‌పై రూ.24,850 తగ్గింపు.. 

Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News