Husband And Wife Relationship: ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనేక రాజకీయ ప్రసంగాలను చేస్తుంటారు. ముఖ్యంగా ముస్లింలకు ఎక్కడైన అన్యాయం జరిగితే తనదైన స్టైల్ లో ఇతరులపై విరుచుకుపడతారు. అలాంటి నేత.. ప్రస్తుతం భార్యతో భర్తలు అన్యోన్యంగా ఎలా మెలగాలో చెప్పడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఈ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. మన దేశంలో పెళ్లికి గొప్ప విలువ ఉంది. ఎక్కడో పుట్టి వివాహం అనే బంధంతో మహిళ మన ఇంటికి వస్తుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ అన్నారు.
Islam mein khawateen ka maqaam#AIMIM #AsaduddinOwaisi #Islam #HonourWoman #WomenPower #Majlis #Hyderabad #Telangana #India pic.twitter.com/zkDu9FDHEO
— AIMIM (@aimim_national) February 4, 2024
అలాంటి గొప్ప మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదన్నారు. మన వంశాన్ని, మంచి సంతానాన్ని జన్మనిచ్చి ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందన్నారు. భార్యపై కొప్పడటం, తక్కువ చేసి మాట్లాడటం పౌరుషం అన్పించుకోదన్నారు. భార్య ఎప్పుడైన కోప్పడితే తప్పేంటని అన్నారు. భార్య.. ఇంట్లో పనులు చేయాలని, బట్టలు ఉతకాలని, మీ శరీరానికి సేవలు చేయాలని ఎక్కడ రాసి పెట్టలేదని అన్నారు.
ఖురాన్, సున్నత్ ఎక్కడ కూడా మహిళలు భర్తలకు సేవలు చేయాలని రాసి పెట్టలేదన్నారు. పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ఒవైసీ షేర్ చేసిన వీడియోను ఉద్దేశించి, పురుషులు తమ భార్యలతో మంచిగా ఉండాలని అన్నారు. భార్యలు సంపాదించే డబ్బులో భర్తలు హక్కులేదన్నారు. కానీ... భర్తలు సంపాదించిన డబ్బులో భార్యలకు హక్కు ఉంటుందన్నారు. ఆమె ఇంటిని నడిపించడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తుందన్నారు.
మహిళలను తిట్టడం, చేయిచేసుకోవడం మంచిది కాదన్నారు. "నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇది చాలా మందిని కలవరపరిచిందన్నారు. చాలా మంది తమ భార్యలను వంట చేయడం లేదని లేదా వారి వంటలో తప్పులు వెతికి విమర్శిస్తుంటారని ఎంఐఎం నేత అసదుద్దీన్ అన్నారు. "నా సోదరులారా, ఇది ఇస్లాం. ఇది (ఎక్కడా వ్రాయబడలేదు) కాదు. ఆపై వారి భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారు ఇప్పటికైన మారాలన్నారు.
మీరు నిజమైన ప్రవక్త అనుచరులైతే ఇప్పటికైనా తమ ప్రవర్తనను మార్చుకొవాలన్నారు. మీ భార్యపై కోపం వెళ్లగక్కడంలో పౌరుషం లేదు. ఆమె కోపాన్ని తట్టుకోవడమే పౌరుషమని ఎంఐఎం అసదుద్దీన్ అన్నారు. AIMIM నాయకుడు ఒక వృత్తాంతాన్ని వివరించాడు, అందులో ఒక పెద్దమనిషి రసూల్ తన భార్య చాలా కోపంగా ఉందని ఫిర్యాదుతో ప్రభావవంతమైన ఖలీఫా అయిన ఫరూక్ ఇ ఆజం వద్దకు వెళ్ళాడు. "ఫరూఖ్-ఏ-ఆజం ఇంటికి చేరుకున్న రసూల్, అతని భార్య కూడా అతనిని తిట్టినట్లు గుర్తించాడు.
Read More: Masala Chai: మసాలా చాయ్ ఇప్పుడు ప్రపంచంలో 2వ బెస్ట్ డ్రింక్, దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..
ఆ తర్వాత ఫరూఖ్-ఏ-ఆజామ్‌తో తాను కూడా అదే ఫిర్యాదుతో వచ్చానని చెప్పాడు. ఫరూఖ్-ఎ-ఆజం అతనితో, 'ఆమె నా భార్య, ఆమె నా ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది. ఆమె నా పిల్లలకు జన్మనిచ్చింది, వారిని చూసుకుంటుంది. ఆమె మనిషి, ఆమె నాకు ఏదైనా (కోపంతో) చెబితే, నేను వింటాను. సోదరులారా, ఈ మనస్తత్వాన్ని పెంపొందించుకోండిని అని చెప్పాడంట.. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.