Treatment Of Cervical Cancer In Telugu: గర్భాశయ క్యాన్సర్ కారణంగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు. దీని వైద్య పరి భాషలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు. ఇది గర్భాశయంతో పాటు శరీరాన్ని కూడా ప్రభావితం చూస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్యాన్సర్ గర్భాశయంలోని కండరాల్లో ఏర్పడి..ఆ తర్వాత పూర్తి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈ క్యాన్సర్‌కి అనేక లక్షణాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ ఉన్నవారిలో మూత్రవిసర్జన సమయంలో యోని భాగంలో నొప్పులు రావడమే కాకుండా మరికొంతమందిలో సెక్స్ తర్వాత నొప్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్యాన్సర్ గర్భం పొందన స్త్రీలో మాత్రమే ఎక్కువ వస్తోందని వారంటున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమస్యలతో బాధపడేవారు ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు:
ఈ క్యాన్సర్ రావడానికి ఎలాంటి కారణాలు లేనప్పటికీ కొన్ని గర్భాశయ సమస్యల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గర్భాశయ క్యాన్సర్ ఉన్నవారిలో DNA కణ నిర్మాణంలోని మ్యుటేషన్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కణాల్లో కూడా మార్పులు వస్తాయి. దీని కారణంగా కాణాల చక్రాలపై కూడా ప్రభావం పడుతుంది. గర్భాశయ క్యాన్సర్ ఉన్నవారిలో గర్భాశయంలోని కణాలు పనితీరులో అనేక రకాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కణజాల్లో గడ్డలు కూడా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంది.
గర్భాశయ క్యాన్సర్ రకాలు:
వైద్య శాస్త్రంలో గర్భాశయ క్యాన్సర్‌ను రెండు రకాలుగా విభజించారు. మొదటిది ఎండోమెట్రియల్ క్యాన్సర్..ఇది గర్భాశయంలోని వివిధ భాగాల్లో అభివృద్ధి చెందుతుంది. రెండవది గర్భాశయ సార్కోమా ఇది చాలా అరుదైన రకమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. క్యాన్సర్ కేసులలో 95% కంటే ఎక్కువ ఇవే అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
గర్భాశయ క్యాన్సర్ చికిత్స:
గర్భాశయ క్యాన్సర్‌కు అనేక చికిత్సలు ఉన్నాయి. ఇది ఉన్న దశను బట్టి వైద్యులు చికిత్సలు చేస్తారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నవారిలో సల్పింగో-ఓఫోరెక్టమీతో గర్భాశయ శస్త్రచికిత్స చేస్తారని వైద్య నిపులనుతు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఉంటే కణితిని రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. దీని కారణంగా మళ్లీ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నవారు హార్మోన్ చికిత్స చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter