/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

7th Pay Commission DA Hike Latest Update: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రానుంది. డీఏ పెంపు ప్రకటన త్వరలోనే రానుంది. ఈసారి కూడా డీఏ పెంపు 4 శాతం ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి 31న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు) 50 శాతానికి చేరనుందని చెబుతున్నారు. ఈ ఏడాది మొదటిసారిగా డియర్‌నెస్ అలవెన్స్ పెరగనుంది. అయితే ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం మార్చి వరకు వేచి ఉండాలి. ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చిన తర్వాత డీఏ ఎంత పెంచాలనేది తేలనుంది. 

గతేడాది డీఏ రెండుసార్లు 4 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం డీఏ 46 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచితే.. 50 శాతానికి చేరుతుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఉద్యోగులకు డీఏ పెంపు అమలులోకి వస్తుంది. డీఏ పెంపు ప్రకటన ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు AICPI ఇండెక్స్ డేటాపై ఆధారపడి ఉంటుంది. అర్ధ సంవత్సరం ప్రాతిపదికన సంవత్సరానికి రెండుసార్లు పెంపు ఉంటుంది. మొదటి డీఏ పెంపు జనవరి నుంచి జూన్ వరకు, రెండో డీఏ పెంపు జూలై నుంచి డిసెంబర్ వరకు వర్తిస్తుంది. జనవరి నుంచి జూన్ మధ్య  AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా జూలై నుంచి డీఏ పెంపు ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న డేటా ఆధారంగా జనవరిలో డీఏ పెంపు ఉంటుంది. ఇప్పటివరకు నవంబర్ AICPI ఇండెక్స్ డేటా రిలీజ్ అవ్వగా.. ఇండెక్స్‌లో 0.7 పాయింట్ల పెరుగుదలతో 139.1 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రస్తుత ఇండెక్స్ ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ 49.68 శాతానికి చేరుకుంది. దశాంశం తర్వాత అంకె 0.50 కంటే ఎక్కువగా ఉన్నందున.. అది 50 శాతంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో 4 శాతం పెరుగుదల ఉంటుంది.

డిసెంబర్ నెలకు సంబంధించిన AICPI ఇండెక్స్ డేటా ఇంకా విడుదల కాలేదు. ఇండెక్స్ ఒక పాయింట్ పెరిగినా.. డీఏ 50.40 శాతానికి మాత్రమే చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో డీఏ పెంపు 50 శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ 2 పాయింట్లు పెరిగినా.. డీఏ 50.49 శాతానికి మాత్రమే చేరుకుంటుంది. అప్పుడు కూడా అది దశాంశ ప్రాతిపదికన 50 శాతం ఉంటుందని చెబుతున్నారు. కానీ 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ఉద్యోగులకు డీఏ 50 శాతం దాటితే.. మొత్తం బేసిక్ పేలో కలిపేసి జీరో నుంచి లెక్కిస్తారు. బేసిక్ శాలరీ రూ.18 వేలు అయితే.. రూ.9 వేలు డీఏ అమౌంట్ బేసిక్‌లో కలుపుతారు. 

Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
7th Pay Commission DA Hike News central employees Likely Get 4 Percent Dearness allowance Hike Check Here Details
News Source: 
Home Title: 

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
 

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
Caption: 
7th Pay Commission DA Hike Latest Update (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 30, 2024 - 17:01
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
150
Is Breaking News: 
No
Word Count: 
350