భారత్-విండీస్ జట్ల మధ్య రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి 364 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు పరుగుల వద్దే కేఎల్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌గా రంగంలోకి దిగి, టీమిండియా తరపున తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడిన పృథ్వీ షా తొలి మ్యాచ్‌తోనే అద్భుతం చేశాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ బాది తన సత్తా చాటుకోవడమే కాకుండా.. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కొత్తగా కుర్రాడిగా జట్టులోకి పృథ్వీ షా ఒకానొక దశలో.. విండీస్ బౌలర్లకు అగ్ని పరీక్షగా నిలిచాడు.
154 బంతుల్లో 134 పరుగులు ( (19X4) ) చేసి ఔట్ అయిన పృథ్వీ షా.. తన సెంచరీని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. చటేశ్వర్ పుజారా 86, అజింక్య రహానే 41 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాటో కోహ్లీ 72 పరుగులతో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 17 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షనాన్ గాబ్రియల్, షెర్మన్ లూయిస్, దేవేంద్ర బిషూ, రోస్టన్ చేజ్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
విండీస్ బౌలర్లకు పృథ్వీ షా అగ్ని పరీక్ష