WTC 2023-25 Points table : తొలి టెస్టులో ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు టీమిండియాకు దిమ్మతిరిగింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే రోహిత్ సేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌సిప్(WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. 43.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ కంటే దిగజారే అవకాశం ఉంది. టీమిండియా గత ఐదు టెస్టుల్లో రెండు మాత్రమే గెలిచింది. స్వదేశంలో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేయడంతోపాటు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సమం చేసుకున్న ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 50 శాతం విజయాలతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలోనూ, న్యూజిలాండ్ టీమ్ 50 శాతంతో మూడో స్థానంలోనూ నిలిచాయి. న్యూజిలాండ్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించి బంగ్లాదేశ్ నాలుగో స్థానం దక్కించుకుంది.
టీమిండియా తర్వాత పాక్, విండీస్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. కొత్త ఏడాదిలో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి రెండో స్థానంలో ఉన్న భారత్.. ఇప్పడు స్వదేశంలో ఇంగ్లండ్ తో ఓడిపోయి కింద స్థాయికి పడిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మెుదలుకానుంది. తొలి రెండ్రోజులు పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేని ఇంగ్లండ్.. అద్వితీయ పోరాటంతో మెుదటి టెస్టులో ఘనవిజయం సాధించింది. ఆరంభంలో ఆధిపత్యం కనబర్చిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ తరఫున తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ హార్ట్లీ ఏడు వికెట్లతో టీమ్‌ఇండియా పతనాన్ని శాసించాడు.
Also Read: Ravindra Jadeja: టీమిండియాకు మరో షాక్.. రెండో టెస్టుకు ఆ స్టార్ ప్లేయర్ దూరం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook