Shani Sade Sati Remedy: శని దయ ఉంటే జీవితంలో వచ్చే అవాంతరాలన్ని తొలగిపోతాయి. ఎంత దీనస్థితిలో ఉన్నా ధనవంతులైపోతారు.. శనిప్రభావం ఎలా ఉంటుందో శనిదశ తొలగిపోయే సమయంలో కూడా మనల్ని ధనవంతులని చేసి వెళ్తాడు. అందుకే శని కృప ఉంటే పేద కూడా రాజు అవుతారు. శనిదేవుడు సంతోషంగా ఉంటే అదృష్టం తారుమారవుతుంది. శనికి వక్ర దృష్టి ఉంటే మనిషి జీవితం విషంలా మారుతుంది. ఏలినాటి శని నుండి విముక్తి పొందడానికి మీరు ఈ పరిహారాలు చేస్తే మంచిది. ప్రఖ్యాత జోతిష నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటో తెలుసుకుందాం.
శని దేవుడు కర్మాను బట్టి ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని మహిమ అపారమైనది. శనిదేవుడు సంతోషంగా ఉంటే అదృష్టం తారుమారవుతుంది. శనికి వక్ర దృష్టి ఉంటే మనిషి జీవితం విషంలా మారుతుంది. ఏలినాటి శని నుండి విముక్తి పొందడానికి మీరు ఈ పరిహారాలు చేస్తే మంచిది. ప్రఖ్యాత జోతిష నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటో తెలుసుకుందాం.
ఏలినాటి శని నుండి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మన జీవితాల్లో శని దేవునికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.
ఏలినాటి శని తొలగించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిపుణుల ప్రకారం ఏలినాటి శని తొలగించే పరిహారం మన ఇంట్లోనే ఉంది. కొన్ని పరిహారాలు ఉపయోగించి శని దేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ పరిహారాలు చేస్తే శని చెడు ప్రభావాలను నివారించవచ్చు.
మీ జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉంటే శని దుష్ప్రభావాలను తగ్గించాలనుకుంటే మిరియాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. సాధారణంగా మన అందరి ఇళ్లలో ఉపయోగిస్తాం. రోజూ మిరియాలు సేవించడం వల్ల ఏలినాటి ప్రభావం తగ్గుతుంది. అంతే కాదు నెయ్యి దీపంలో మిరియాలు కాల్చితే ఏలినాటి శని దశ దూరమవుతుంది.
మిరియాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా కాపాడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలవుతున్నా మిరియాల రెమిడీ చాలా మేలు చేస్తుంది. మిరియాలు 7 నుండి 8 గింజలను ఇంట్లో ఏదైనా మూలలో కాల్చాలి. ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది.
దీనికి ప్రత్యేక రోజు ఉంది. అమావాస్య లేదా పూర్ణిమ తిథి రోజు మిరియాల గింజలు తీసుకుని ఓం క్లీన్ బీజ మంత్రాన్ని జపించి, మీ కుటుంబ సభ్యుల తలపై నుండి మిరియాలను తీసుకుని ఇంటికి దక్షిణం వైపు వేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శత్రు భయం కూడా ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook