'జమ్మూకాశ్మీర్.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే': ఐరాసలో భారత్

'పాత పాక్‌కు కొత్త పాక్‌కు తేడా లేదు': భారత్

Last Updated : Sep 30, 2018, 09:47 AM IST
'జమ్మూకాశ్మీర్.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే': ఐరాసలో భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌ తీరును భారత్‌ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేస్తుంటే పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ఏమి ఎరగనట్లు అబద్దాలాడుతోందని వ్యాఖ్యానించింది. పాత పాకిస్థాన్‌కు కొత్త పాకిస్థాన్‌కు పెద్దగా లేదా లేదని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి ఈనం గంభీర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి 73వ సాధారణ సమావేశాల సందర్భంగా జనరల్ అసెంబ్లీలో ఈనం గంభీర్ మాట్లాడారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురేషీ చేసిన నిరాధారమైన ఆరోపణలను ఆమె తిరస్కరించారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి ఈనం గంభీర్

ఈనం గంభీర్ మాట్లాడుతూ.. పాత పాకిస్థాన్‌కు కొత్త పాకిస్థాన్‌కు పెద్దగా లేదా లేదని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్.. యూఎన్‌లో ఈనం గంభీర్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. 2014లో పెషావర్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిని గుర్తుచేసిన ఆమె.. అదో విషాద ఘటన అని.. నాటి ఘటనకు భారత పార్లమెంట్‌లోని ఉభయసభలు నివాళులు అర్పించినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో భాగమే అని .. ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

 

 

మరోవైపు ఐక్యరాజ్యసమితి 73వ సాధారణ సమావేశాలకు భారత్‌ తరఫున హాజరైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికి పెనుముప్పుగా ఆమె అభివర్ణించారు.  పాకిస్తాన్‌ ఓవైపు భారత్‌తో చర్చలు అంటూనే సరిహద్దుల్లో ఉగ్రవాదుల సహాయంతో కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఐక్యరాజ్యసమితి వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన ఉన్న తమ దాయాది దేశంతీరుతో చర్చల ప్రక్రియను విరమించుకున్నామని సుష్మా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను కీర్తిస్తూ పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేస్తున్న దేశంతో చర్చలు జరిపిన ఫలితం ఉండదని అన్నారు.

అటు కాశ్మీర్‌ వివాదంలో జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి(యుఎన్‌) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గటెర్రెస్‌కు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురేషీ విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల కోరిక ఆకాంక్షల మేరకు యుఎన్‌ చట్టాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. భారతదేశంతో యుద్ధం తమ అభిమతం కాదని ఓ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఖురేషీ అన్నారు. భారత్‌, పాక్ ల మధ్య వివాదాలకు సైన్యం పరిష్కారం కాదన్నారు.  పొరుగు దేశాలు రెండూ కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలని చెప్పిన ఆయన.. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం అని అన్నారు.

Trending News