హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ... కాంగ్రెస్ వాళ్లు తలచుకుంటే 5 నిమిషాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నిఅణచి వేసే వాళ్లమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అంటున్నారు..ఇది కాంగ్రెస్ వాళ్ల ఫ్యూడల్ మనస్తత్వానికీ... పొగరుబోతుతనానికి ఇదే నిదర్శనం’ అంటూ జానారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్లింగ్ షేర్ చేసుకున్నారు.
ఈ వీడియోలో జానా ఏమన్నారంటే...?
పాకిస్తాన్ తో యుద్దం వచ్చినా ఈజీగా ఎదరించినటువంటి భారత ప్రభుత్వం..ఉగ్రవాదుల్సి ఉరుకులు పెట్టిస్తున్న బలమైన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యమం పేరుతో కేసీఆర్ ఆయన ఆధర్యంలో గుప్పెడు మంది అటూఇటూ అందోళన చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడుతుందా ?..ఇది సాధ్యం అయ్యే పనేనా ? వాస్తవానికి కేంద్రం తలచుకున్నట్లయితే వారి ఆందోళనను ఐదు నిమిషాల్లో అణచివేయగలదు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్ణయం వల్లే తెలంగాణ ఇచ్చిందనే అర్థం వచ్చేలా ఆయన స్పందించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఈ వీడియో క్లిప్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసి..జానారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ షేర్ చేసిన వీడియో మీరూ చూడగలరు...
Senior Scamgress man Jana Reddy openly says they could’ve crushed Telangana agitation in 5 minutes. What feudal arrogance!
... తెలంగాణాలో కేసీఆర్ ఆధ్వర్యంలో గుప్పెడుమంది అటు ఇటు ఆందోళనలు చేస్తే ఈ రాష్టం ఏర్పడుతుందా ..అది వీలే లేనటువంటిది ..5 నిమిషాల్లో అణిచేయాలంటే అణిచేసేవాళ్ళం pic.twitter.com/CkjsJwAyhd
— KTR (@KTRTRS) September 28, 2018