Sabja Seeds Benefits: సబ్జా గింజలను చియా గింజలు అని కూడా పిలుస్తు ఉంటారు. దీనిని ఎక్కువగా మనం జ్యూస్ తయారిలో, వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఈ గింజలు మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చియా, సబ్జా గింజల్లో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
❀ సబ్జా గింజలు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది.
❀ నిపుణుల ప్రకారం సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
❀ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికలను పెంచడంలో సహాయపడుతుంది.
❀ అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.
❀ అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఈ సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి.
❀ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలో ఈ గింజలు సహాయపడుతాయి.
Also read: Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే నూనెలు ఇవే..మీరు ట్రై చేయండి..
❀ సబ్జా గింజల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.
❀ కీళ్లనొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ సమస్యల బారిన బాధపడుతున్నవారు ఈ సబ్జా గింజలతో ఉపశమనం పొందవచ్చు.
❀ జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడే వారు సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ విధంగా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Palak Soup: అధిక బరువు సమస్యకు పాలక్ సూప్‌తో చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter