Ys jagan meet KCR: కేసీఆర్‌ను పరామర్శించిన జగన్, 45 నిమిషాలు భేటీ

Ys jagan meet KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఇంట్లో పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు ఇరువురి మధ్య చర్చ సాగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2024, 02:55 PM IST
Ys jagan meet KCR: కేసీఆర్‌ను పరామర్శించిన జగన్, 45 నిమిషాలు భేటీ

Ys jagan meet KCR: తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారి పడిన కేసీఆర్‌కు తుంటి ఎముక విరగడంతో సర్జరీ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమౌతోంది. ఇద్దరు దాదాపు 45 నిమిషాలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శతృత్వం ఉన్న ఈ ఇద్దరూ ఆ తరువాత జరిగిన వివిధ పరిణామాలతో స్నేహితులుగా మారారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. చాలా అంశాల్లో రెండు ప్రభుత్వాలు సహకరించుకున్నాయి. అయితే గత రెండు మూడేళ్లుగా ఇద్దరూ నేరుగా సమావేశం కాలేదు. ఇదే తిరిగి కలవడం. 

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి, ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఇద్దరి కలయిక ప్రాధాన్యత సంతరిచుకుంది. దాదాపు 45 నిమిషాలసేపు జరిగిన చర్చల్లో పక్కన మరెవరూ లేకపోవడం విశేషం. మరో 3-4 నెలల్లో తెలంగాణ లోక్‌సభ, ఎపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలే ప్రధానంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. అయితే ఏం చర్చించుకున్నారనేది మాత్రం బయటకు రాలేదు. పలు కీలకమైన అంశాలపైనే చర్చ సాగినట్టు సమాచారం. 

కేసీఆర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ నేరుగా లోటస్ పాండ్‌కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాల్సి ఉన్నా..తల్లి విజయమ్మను కలిసేందుకు లోటస్ పాండ్‌కు వెళ్లారు. సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపధ్యంలో వైఎస్ జగన్ విజయమ్మతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. 

Also read: YS Sharmila: కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల.. ముగిసిన వైఎస్సార్టీపీ ప్రస్థానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News