Betel Leaf Medicinal Uses: తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇన్పెక్షన్‌ల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. దీని ఎంతో శరీరంలో వచ్చే కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో కూడా తమలపాకు సహాయపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యల బారి నుంచి ఉపశమనం పొందవచ్చు. తమలపాకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తమలపాకుతో కలిగే ప్రయోజనాలు ఇవే..
>> తమలపాకులో వెల్లుల్లి రెబ్బ, చిన్న అల్లం ముక్క, దీనిలో తేనె కలిపి ఈ మిశ్రమని పరగడుపు ననమిలి తినాలి. ఇలా రోజులు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. దీనిని 21 రోజుల పాటు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తమలపాకును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>> ఇది పెద్దలకు కాకుండా చిన్న పిల్లల కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లల కడుపుపై ఉంచడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు నుంచి బయటపడవచ్చు.
>> శీతాకాలంలో చిన్నపిల్లలు తరుచుగా జలుబు బారిన పడుతుంటారు. తమలపాకులో కొంచెం పసుపు రాసి పిల్లల తలపై ఉంచడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Health Tips: రోజూ ఉదయం పాలు, అరటి పండ్లు తీసుకుంటే ఆ 5 సమస్యలకు చెక్
>> నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారు రోజు తమలపాకుతో తయారు చేసిన ఈ హల్వ తీసుకోవడం వల్ల సుఖంగా నిద్రపోవచ్చు. హల్వ తయారు చేసుకోండి ఇలా..
>> జాజికాయను, యాలకులను, గులాబి రేకులను, లవంగాలను, ఎండు కొబ్బరిని తీసుకుని తేనెతో కలిపి పాకం పట్టి హల్వా లాగా తయారు చేసుకోవాలి. ఈ హల్వాను తమలపాకుతో కలిపి తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
>> అంతేకాకుండా తలమపాకు హల్వతో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
>> తమలపాకును ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Jeera Water For Gastritis: జీరా వాటర్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Betel Leaves: తమలపాకులో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోండి..!