Bank Alerts: బ్యాంకు లాకర్లు కలిగిన కస్టమర్లకు ముఖ్య గమనిక. దేశంలోని అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు డిసెంబర్ 31లోగా కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయాల్సి ఉంది. లాకర్ ఉన్నవాళ్లు మరో 15 రోజులుగా విధిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
లాకర్ కలిగిన బ్యాంకు కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. బ్యాంకు లాకర్లకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ సూచనల మేరకు ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ కస్టమర్లు డిసెంబర్ 31లోగా లాకర్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. డిసెంబర్ 31 లోగా లాకర్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. దేశంలోని చాలా బ్యాంకులు లాకర్ అగ్రిమెంట్‌ను రివైజ్ చేశాయి. కస్టమర్లు విధిగా ఒప్పంద కాగితాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈమెయిల్, ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి. ఒప్పంద పత్రాలపై సంతకం చేయాల్సి ఉన్నందున విధిగా బ్యాంకుకు రావల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో జరిగే ప్రక్రియ కాదు. బ్యాంకుకు వెళ్లి ఆధార్, పాన్ నెంబర్, ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. లాకర్‌కు సంబంధించిన స్టాంప్ పేపర్, బ్యాంక్ లాకర్ ఒప్పందంపై సంతకం చేయాలి.
బ్యాంకు లాకర్లు కలిగినవాళ్లంతా విధిగా డిసెంబర్ 31లోగా ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం అందించి ఒప్పందాలు పూర్తి చేసి స్టేటస్‌ను ఆర్బీఐ పోర్టల్‌పై అప్‌డేట్ చేయాలి. చాలామంది బంగారం, ఇతర కీలక డాక్యుమెంట్లు లాకర్లలో దాచుకుంటుంటారు. మీక్కూడా బ్యాంక్ లాకర్ ఉంటే విధింగా బ్యాంకుకు వెళ్లి లాకర్ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook