Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండెపోటు వ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. చిన్నారులు, యువకులు, వృద్ధులు అందరూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనశైలి బిజీగా మారడంతో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతంది. అయితే గుండెపోటు వచ్చే ముందు కన్పించే కొన్ని లక్షణాలతో అప్రమత్తం కావాలంటున్నారు వైద్యులు.
బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌పై మక్కువ పెరిగిపోతోంది. అదే సమయంలో సకాలంలో నిద్ర, తిండి ఉండటం లేదు. పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా గుండెపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. గుండెపోటు అనేది ఎప్పుడూ యధాలాపంగా ఒకేసారి వచ్చేయదని గుర్తుంచుకోవాలి. వచ్చేముందు వివిధ రూపాల్లో సంకేతాలు ఇస్తుంటుంది. వాటిని మనం వేరే ఏదో అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటాం.
ఛాతీ నొప్పి ప్రధానమైన లక్షణం. గుండెపోటుకు ముందు ఇది మొదలవుతుంది. ఛాతీ నొప్పితోపాటు ఒత్తిడి, గట్టిగా ఉండటం, భారంగా ఉండటం సంభవిస్తుంది. ఇంకొంతమందిలో ఎడమ చేయి, మెడ, దవడ, వెన్ను, పొట్టలో నొప్పి ఉండవచ్చంటున్నారు. కొంతమందికి ఉదయం లేదా అర్ధరాత్రి చెమటలు పడుతుంటాయి. ఇది ఏ మాత్రం మంచి లక్షణం కానేకాదు. తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిందే. ఉదయం పూట చెమట్లు పట్టడం అనేది లేదా రాత్రి పూట చెమట్లు పట్టడం కచ్చితంగా గుండెపోటుకు సంకేతమే.
గుండెపోటు వచ్చే ముందు మనస్సు చంచలంగా ఉంటుంది. వాంతులు రావచ్చు. సాధారణంగా ఈ సమస్య ఉదయం వేళ ఉంటుంది. ఈ లక్షణం మీలో ఎవరికైనా కన్పిస్తే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చాలా సందర్భాల్లో సైలెంట్ హార్ట్ ఎటాక్ సమస్య కన్పిస్తోంది. అందుకే ఏ చిన్న లక్షణం కన్పించినా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Ranapala Benefits: రణపాల ఆకులతో బోలెడు లాభాలు..ముఖ్యంగా ఈ వ్యాధులున్నవారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heart Attack Signs: గుండెపోటు ఎప్పుడూ హఠాత్తుగా రాదు, ఈ 5 లక్షణాలు ఉండవచ్చు