How To Identify Fake GST Bill: జీఎస్టీ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు అధికారులు గత కొంతకాలంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశంలో చాలా వరకు నకిలీ ఇన్వాయిస్ను బిల్లులతో మోసాలు జరుగుతున్న అధికారుల దృష్టికి రావడంతో వాటికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. వ్యాట్, సేవా పన్ను మొదలైన అనేక పరోక్ష పన్నులను తొలగించి.. దేశంలో పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు 2017లో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వ్యాపారం చేస్తున్న వారు ఎవ్వరైనా కచ్చితంగా GSTIN తో ఇన్వాయిస్ను జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులోని కొన్ని లోసుగులను ఉపయోగించుకుని కొందరు నకిలీ ఇన్వాయిస్లతో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ట్యాక్స్ పూర్తిగా చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు.
ఫేక్ జీఎస్టీ ఇన్వాయిస్లతో చిన్న వ్యాపారాలు, కస్టమర్లకు పెద్ద ఇబ్బందిగా మారింది. ట్యాక్స్ పేరుతో కస్టమర్ల నుంచి వసూలు చేసి.. ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేస్తున్నారు. జీఎస్టీ చెల్లించకుడా కేటుగాళ్లు వ్యాపారులను, కస్టమర్లను మోసం చేసేందుకు ఫేక్ జీఎస్టీ బిల్లులను రూపొందిస్తున్నారు. మరి నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ బిల్లును ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి.
==> అధికారిక GST పోర్టల్ https://www.gst.gov.in/ సందర్శించండి. GSTIN నంబరు ఆధారంగా జీఎస్టీ ఇన్వాయిస్ను ధృవీకరించవచ్చు.
==> హోమ్‌పేజీలో చలాన్లో ఇచ్చిన GSTIN నంబర్ని చెక్ చేయడానికి 'సెర్చ్ ట్యాక్స్‌పేయర్' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
==> GSTIN నిజమైనది అయితే.. వెబ్సైట్లో ఆ జీఎస్టీ నంబరుకు వివరాలు డిస్ప్లేపై ప్రత్యక్షం అవుతాయి.
GSTIN ఫార్మాట్ ఇలా..
GSTIN నంబర్ 15 అంకెలతో ఉంటుంది. ఈ నంబరు గురించి తెలుసుకుంటే.. ఫేక్ జీఎస్టీని ఈజీగా గుర్తించవచ్చు. GSTIN మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్‌ను సూచిస్తాయి. ఆ తరువాత 10 అంకెలు విక్రేత లేదా సరఫరాదారు పాన్ నంబర్ వివరాలు ఉంటాయి. 13వ అంకె అదే పాన్ హోల్డర్ యూనిట్ సంఖ్య ఉంటుంది. 14వ అంకె 'Z' అక్షరం, 15వ అంకె 'చెక్సమ్ అంకె' ఉంటుంది.
ఎవరికి ఫిర్యాదు చేయాలి..?
==> మీరు అధికారిక జీఎస్టీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఫిర్యాదును 'CBEC మిత్ర హెల్ప్‌డెస్క్', 'వెబ్ టిక్కెట్‌ని పెంచండి'లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు.
==> లేదా మీరు cbecmitra.heldesk@icegate.gov.in కి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
==> జీఎస్టీ అధికారిక ట్విట్టర్‌కు ట్యాగ్ చేసి కూడా కంప్లైంట్ రైజ్ చేయవచ్చు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి