IND Vs AUS Dream11 Team Tips: భారత్, ఆసీస్ మధ్య ఫైనల్‌ ఫైట్‌కు రెడీ.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs New Zealand Dream11 Prediction and Playing 11: వరల్డ్ కప్‌ ఫైనల్‌లో అమీతుమి తేల్చుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ మొదలుకానుంది. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 18, 2023, 09:25 PM IST
IND Vs AUS Dream11 Team Tips: భారత్, ఆసీస్ మధ్య ఫైనల్‌ ఫైట్‌కు రెడీ.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs New Zealand Dream11 Prediction and Playing 11: అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే పోరుకు రంగం సిద్ధమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ పోరు మరికొన్ని గంటల్లో ఆరంభంకానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో అజేయంగా టీమిండియా ఫైనల్‌కు చేరుకోగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకుని వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది కంగారూలు ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చారు. భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి ఆరోసారి విశ్వకప్‌ను చేజిక్కించుకోవాలని ఆసీస్ చూస్తుండగా.. 2003 ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని మూడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సొంతగడ్డపై టీమిండియా హాట్ ఫేవరెట్‌గా రంగంలోకి దిగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌ ఆరంభంకానుంది. రెండు జట్లు కూడా తుది జట్లలో మార్పులు చేసే అవకాశం లేదు. అయితే పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వంటి వివరాలు మీ కోసం..

పిచ్ రిపోర్ట్, వెదర్ అప్‌డేట్

నరేంద్ర మోచ్ స్టేడియం పిచ్ ఎక్కువగా బ్యాట్స్‌మెన్లకు సహకరిస్తుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే కొత్త బంతితో పేసర్లు వికెట్ల తీయొచ్చు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కూడా సహాయపడుతుంది. పిచ్‌ మంచి బౌన్స్ ఉండడంతో రెండు ఇన్నింగ్స్‌లలో మొదటి 10 ఓవర్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ 10 ఓవర్లు వికెట్ కాపాడుకుంటే.. ఆ తరువాత పరుగుల వరద పారించే అవకాశం ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య లీగ్ స్టేజ్ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌లోనే ఫైనల్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లతో పోలిస్తే (22) పేస్ బౌలర్లు ఎక్కువ వికెట్లు (35) తీసుకున్నా.. పేసర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు కేవలం ఓవర్‌కు 4.89 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో ముందుగా బౌలింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. ఫైనల్‌లో ఒత్తిడిని తట్టుకునేందుకు టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 33 డిగ్రీలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
  
==> వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం (టాస్ టైమ్)
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోస్ ఇంగ్లిష్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, హేజిల్‌వుడ్ 

IND Vs AUS డ్రీమ్11 టీమ్ టిప్స్..

==> వికెట్ కీపర్: కేఎల్ రాహుల్
==> బ్యాటర్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్
==> ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (వైస్ కెప్టెన్)
==> బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, స్టార్క్, ఆడమ్ జంపా.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, కప్ మనదేనా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News