World Cup Final 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. నవంబర్ 19 అంటే రేపు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వా నేనా రీతిలో తలపడనున్నాయి. కచ్చితంగా రేపటి మ్యాచ్ ఆసక్తిగా, ఉత్కంఠగా ఉండనుందనే అంచనాలున్నాయి.
ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆడిన పది మ్యాచ్‌లు కూడా గెలిచి విజయ పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ టీమ్ ఇండియా రెండు సార్లు ప్రపంచకప్ గెలవగా మూడవసారి గెలిచే అవకాశం 12 ఏళ్ల తరువాత తిరిగి ఇప్పుడే దక్కింది. అందుకే ఈసారి చేజారకూడదనే గట్టి ప్రయత్నంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచకప్‌ను ఐదు సార్లు సాధించింది. ఆరవసారి టైటిల్ గెలవాలనే కసితో ఉంది. కివీస్‌పై విజయంతో టీమ్ ఇండియా, సఫారీలపై విజయంతో ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరాయి.
ఈ రెండు జట్ల ట్రాక్ రికార్డు పరంగా పరిశీలిస్తే ఆస్ట్రేలియాది పైచేయిగా ఉన్నా..ఈ ప్రపంచకప్‌లో మాత్రం టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ప్రతి ఒక్కరూ ఫామ్‌లో ఉండటం విశేషం, బ్యాటింగ్ పరంగా రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్ ఇలా అందరూ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమీ చెలరేగిపోతున్నాడు. బూమ్రా, సిరాజ్‌లు అద్భుతమైన పేస్ ఇస్తున్నారు. ఇక రవీంద్ర జడేడా, కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు టీమ్ ఇండియాపైనే ఉంది. కచ్చితంగా ఫేవరేట్ టీమ్ ఇండియానే అంటున్నారు.
టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం అదే జోస్యం చెబుతున్నాడు. ఈసారి కప్ గెలిచేది టీమ్ ఇండియానే అంటున్నాడు. ఆడిన 9 మ్యాచ్‌లలో ఒక్క ఓటమి లేకుండా లిగ్ దశ ముగించడం సులభమైన విషయం కాదన్నారు. కవీస్ వంటి బలమైన ప్రత్యర్ధిని సెమీస్‌లో 70 పరుగుల తేడాతో ఓడించడాన్ని మర్చిపోకూడదని రవిశాస్త్రి చెప్పాడు. ఇప్పటి వరకూ అన్ని మ్యాచ్‌లు గెలిచి ఆటగాళ్లు మంచి రిలాక్స్ గా ఉన్నారని..ఇది మంచి అనుభవం అవుతుందని అన్నాడు. రేపు జరగాల్సిన ఫైనల్లో కూడా టీమ్ ఇండియా ఆటగాళ్లు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదని..ఇప్పటి వరకూ ఎలా ఆడారో అలా ఆడితే సరిపోతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అందుకే కచ్చితంగా ఈసారి కప్ ఇండియాదేనంటున్నాడు.
Also read: World Cup 2023: విన్నింగ్ కెప్టెన్లకు ఐసీసీ ఆహ్వానం, ప్రత్యేక బ్లేజర్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook